తెలుగులోనూ ఆయేషా ఖాన్ (Aayesh Khan) పాపులర్. 'ఓం భీమ్ బుష్' సినిమాలో ప్రియదర్శి జంటగా కనిపించారు. శర్వానంద్ 'మనమే'లో ఓ కీలకమైన రోల్, ఆ మధ్యలో విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో స్పెషల్ సాంగ్ చేశారు. అయితే ఆయేషాకు విపరీతమైన పాపులారిటీ తీసుకు వచ్చినది మాత్రం రణవీర్ సింగ్ 'ధురంధర్' సినిమాలో 'షరారత్' సాంగ్. ఇప్పుడు ఆ ఐటమ్ సాంగ్ నుంచి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

అక్షయ్ కుమార్ జంటగా ఆయేషా ఖాన్!Ayesha Khan to Star Opposite Akshay Kumar in Bhagam Bhag 2: యంగ్ అండ్ సౌత్ హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడంలో మిగతా హిందీ హీరోలతో పోలిస్తే అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందు ఉంటారు. ఏడాదికి మినిమమ్ మూడు సినిమాలైనా చేసే బాలీవుడ్ ఖిలాడీ... గతంలో నటించిన ఓ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. అదే 'భాగమ్ భాగ్ 2'.

ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించిన కామెడీ హిట్ 'భాగమ్ భాగ్'. అది 2006లో విడుదల అయ్యింది. 20 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. ఈసారి దర్శకత్వ బాధ్యతలను రాజ్ శాండిల్యకు అప్పగించారు. లేటెస్ట్ బాలీవుడ్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో ఆయేషా ఖాన్ నటించనున్నారట. ఆమె ఓ హీరోయిన్ రోల్ దక్కించుకున్నారని తెలిసింది.

Also ReadTollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

అక్షయ్ కుమార్ సినిమాలో మీనాక్షి చౌదరి!?తెలుగులో 'సంక్రాంతికి వస్తున్నాం', 'అనగనగా ఒక రాజు' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆమె కూడా 'భాగమ్ భాగ్ 2'లో నటించనున్నారని బాలీవుడ్ టాక్.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

'భాగమ్ భాగ్'లో అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావెల్ నటించారు. ఇప్పుడీ సీక్వెల్ విషయానికి వస్తే... గోవిందా నటించడం లేదని, ఆయన స్థానంలో మనోజ్ బాజ్ పేయి వస్తారని టాక్. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Also ReadViral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్