Shruti Hassan Joins NBK 107: బాలయ్య సినిమా సెట్స్‌లో శృతి హాసన్ - ర్యాపిడ్ స్పీడులో షూటింగ్

నట సింహం నందమూరి బాలకృష్ణకు జంటగా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Continues below advertisement

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో ఒక సినిమా (NBK 107) రూపొందుతోంది. ఇందులో శృతి హాసన్ (Shruti Hassan) కథానాయిక. లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... షూటింగ్‌లో ఆమె జాయిన్ అయ్యారు. 
''కిర్రాక్ బ్యూటీ శృతి హాసన్ ఎన్.బి.కె 107 సెట్స్‌లో జాయిన్ అయ్యారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది'' అని చిత్ర బృందం పేర్కొంది. దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు శృతి హాసన్ దిగిన ఫోటోను విడుదల చేసింది. ప్రస్తుతం హీరో హీరోయిన్లతో పాటు నటుడు లాల్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా... కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
 
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్', 'భయం నా బయోడేటాలోనే లేదురా', నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు' అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు అభిమానులు, మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

Continues below advertisement

'అఖండ' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రమిది. అలాగే, 'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్  యలమంచిలి నిర్మిస్తున్నారు.

Also Read: ఇజ్రాయెల్ మీడియాలో ఎన్టీఆర్‌పై ఆర్టికల్ - నెట్టింట వైరల్

ఇందులో హానీ రోజ్ రెండో కథానాయిక. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మోడల్ కమ్ హీరోయిన్, 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో చేశారు.  ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన తారాగణం. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: 'సుడుల్' రివ్యూ: శ్రియా రెడ్డి, ఐశ్వర్యా రాజేష్ నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Continues below advertisement