Shivarajkumar First Look Released In Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో అవెయిటెడ్ మూవీ 'పెద్ది'. ఇప్పటికే ఈ మూవీ నుంచి చరణ్ మాస్ లుక్, గ్లింప్స్, ఇతర యాక్టర్స్ లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో ఓ కీలక రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాలో ఆయన లుక్ రివీల్ చేశారు మేకర్స్.
గౌర్నాయుడుగా...
మూవీలో గౌర్నాయుడుగా కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. గంభీరమైన లుక్‌లో హైప్ క్రియేట్ చేశారు శివన్న. ఆయన గ్రామపెద్దగా కనిపించనున్నారని... కాదు చరణ్ కోచ్‌గా కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆయనకు చరణ్, బుచ్చిబాబు స్పెషల్‌గా విషెష్ చెప్పారు.
హ్యాపీ బర్త్ డే శివన్న గారూ...
హ్యాపీ బర్త్ డే శివన్న గారూ అంటూ చరణ్ బర్త్ డే విషెష్ తెలిపారు. 'మూవీలో గౌర్నాయుడు పాత్రను అందరూ ఇష్టపడతారు. పెద్దిలో మీతో స్క్రీన్ పంచుకోవడం ఎంతో గౌరవంగా ఉంది.' అంటూ ట్వీట్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే డియర్ శివన్న. మీలాంటి లెజండరీ, పాజిటివ్ దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తితో కలిసి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సెట్‌లో మీరు ఉన్నారంటే ఎంతో స్ఫూర్తి ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా.' అంటూ బుచ్చిబాబు పోస్ట్ చేశారు. మరోవైపు... ఈ సినిమాలో తన రోల్ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుందని గతంలో శివన్న చెప్పారు.
Also Read: 10 నెలలు ఆమిర్ ఖాన్ ఇంట్లోనే గుత్తా జ్వాల - ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు... విష్ణు విశాల్ ఎమోషనల్
ఇప్పటివరకూ పలు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా ప్రస్తుతం కీలక యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్ బుజ్జిగా మీర్జాపూర్ ఫేం 'దివ్యేందు శర్మ' కీలక రోల్ పోషిస్తుండగా ఇటీవలే ఆయన లుక్ రివీల్ చేశారు మేకర్స్. జగపతి బాబు, శివరాజ్ కుమార్, అర్జున్ అంబటి కీలక పాత్రలు పోషించారు. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వాస్తవ సంఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కిస్తుండగా... వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది.