Chiranjeevi Anil Ravipudi Movie Title Fixed: మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కుతుండగా... టైటిల్ ఏంటనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

టైటిల్ ఫిక్స్ చేసేశారా?

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తన ఒరిజినల్ నేమ్ శివశంకర్ వరప్రసాద్ పేరుతోనే కనిపించనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా... సంక్రాంతి బ్యాక్ డ్రాప్‌లో టైటిల్ ఉంటుందనే రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, డిఫరెంట్‌గా ఈ సినిమాకు 'మన శంకర్ వరప్రసాద్ గారు...' అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: లవ్ అంటే నమ్మకమే... మ్యారేజ్ అంటే మాత్రం చాలా భయం - పెళ్లిపై శ్రుతి హాసన్ ఏం చెప్పారంటే?

గెస్ట్ రోల్‌లో వెంకీ

ఈ సినిమాలో ఓ కీలక రోల్‌లో విక్టరీ వెంకటేష్ నటించనున్నారు. దీనిపై ఇటీవలే ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆయన రోల్ ఏంటి అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చిరంజీవి డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉత్తరాఖండ్ ముస్సోరిలో కీలక సీన్స్ షూటింగ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మూవీ ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది.

రిలీజ్‌కు ముందే బిగ్ డీల్?

ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయిందనే న్యూస్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ కోసం బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి హిట్ కాంబో కావడంతో దాదాపు రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య డీల్ కుదిరిందని సమాచారం. ఓవైపు షూటింగ్ అవుతుండగానే ఇంత భారీ స్థాయిలో డీల్ రావడంపై మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

ఈ మూవీలో నయనతార (Nayanthara) హీరోయిన్‌గా చేస్తున్నారు. వీరితో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, 'బలగం' మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా... వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నారు.