సెప్టెంబర్ 20... అక్కినేని నాగేశ్వరరావు జయంతి (Akkineni Nageswara Rao Birth Anniversary). ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'శివ' సినిమా రీ రిలీజ్ (Shiva Re Release Date) అనౌన్స్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna). సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆయన చేసిన మొదటి సినిమా, కల్ట్ క్లాసిక్ 'శివ' మళ్ళీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?
నవంబర్ 14న 'శివ' రీ రిలీజ్!ఏయన్నార్ 101వ జయంతి సందర్భంగా నవంబర్ 14న 'శివ' సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున తెలిపారు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుతూ... ''తరాలు మారినా తెరపై చెరగని ముద్ర వేసే శక్తి సినిమాకు ఉందని మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. తరాలకు అతీతంగా జీవించే శక్తి సినిమాకు ఉందని ఆయన అనేవారు. అటువంటి సినిమాల్లో శివ ఒకటి. నవంబర్ 14న 4కే డాల్బీ ఎట్మాస్ లో విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.
'శివ'కు ముందు, తర్వాత...తెలుగు సినిమా ప్రయాణాన్ని మార్చిన సినిమాల్లో 'శివ'ది ప్రత్యేక స్థానం. 'శివ'కు ముందు, 'శివ'కు తర్వాత అనేలా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ మార్చిన ఘనత రామ్ గోపాల్ వర్మది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో ఏయన్నార్ పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. దర్శకుడిగా పరిచయమైన సినిమాతో రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్న తరుణంలో సౌండ్ మీద మరింత వర్క్ చేశారట. ఈసారి థియేటర్లలో సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని యూనిట్ చెబుతోంది.
Also Read: తెలంగాణలోనూ 'ఓజీ' టికెట్ రేట్స్ పెరిగాయ్... ముందు రోజు రాత్రి ప్రీమియర్ షో కూడా!
అక్కినేని నాగార్జున ఈ ఏడాది రెండు భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. ఓ ప్రధాన పాత్రలో ఆయన నటించిన 'కుబేర' వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రతినాయకుడిగా నటించిన 'కూలీ' 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ముందు ధీటైన విలనిజం చూపించిన నాగార్జున నటన తెలుగు, తమిళ ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది.