కరుణడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కథానాయకుడిగా నటించిన సినిమా 'ఘోస్ట్' (Ghost Movie). ఇది పాన్ ఇండియా సినిమా. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. 'కెజియఫ్', 'విక్రాంత్ రోణ', 'కాంతార' విజయాల తర్వాత కన్నడ సినిమాపై ఇతర భాషల ప్రేక్షకులు చూస్తున్నారు. 


నట సింహం బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో ఆయన ఓ పాటలో అతిథిగా కనిపించారు. రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్'లో కీలకమైన పోలీస్ అధికారి పాత్ర చేశారు.ఇప్పటి వరకు శివ రాజ్ కుమార్ నటించిన కొన్ని సినిమాలు ఇతర భాషల్లో అనువాదం అయ్యాయి. ఆయన హీరోగా 'వేద' సినిమాకు ఓటీటీలో అన్ని భాషల వీక్షకులను ఆకట్టుకుంది. త్వరలో బాలకృష్ణతో మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్లు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆయన అనౌన్స్ చేశారు. దాంతో శివ రాజ్ కుమార్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల కన్ను పడింది. 'కబ్జా 2'లో ఆయన రోల్ మెయిన్ కనుక... ఈ సినిమాతో హిట్ అందుకోవాల్సిన అవసరం ఉంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... 'ఘోస్ట్' టీజర్ విడుదల తేదీ ఖరారు అయ్యింది.  


జూలై 12న 'ఘోస్ట్' టీజర్ 
Ghost Movie Teaser Release Date : ఈ ఏడాది జూలై 12న కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'ఘోస్ట్' టీజర్ ను  భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు దర్శక - నిర్మాతలు ప్రకటించారు. సినిమా విడుదల తేదీ ఆ రోజు వెల్లడించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కన్నడ హిట్ సినిమా 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకుడు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. 'బిగ్ డాడీ గ్రాండ్ ఎంట్రీ కోసం రెడీ అవ్వండి' అని పేర్కొన్నారు. 






ఘోస్ట్... యాక్షన్ & థ్రిల్!
'ఘోస్ట్' సినిమాలో శివ రాజ్ కుమార్ క్యారెక్టర్, అందులో ఆయన నటన హైలైట్ అవుతాయని చిత్ర బృందం పేర్కొంది. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా కోట్ల రూపాయలతో సెట్స్ వేశామని తెలిపింది. ముఖ్యంగా జైలు సెట్, అందులో యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయట. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన చిత్రమిది.


Also Read : ప్రతిదీ ఓ గుణపాఠమే - డ్రగ్స్ కేసును ఉద్దేశించేనా సురేఖా వాణి?


ఆడియో @ ఆనంద్!
'ఘోస్ట్' ఆడియో & మ్యూజిక్ హక్కులను కన్నడనాట ప్రముఖ ఆడియో కంపెనీగా పేరు పొందిన ఆనంద్ ఆడియో సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేశారట. ఒక్క కన్నడ మాత్రమే కాదు... మిగతా భాషల ఆడియో హక్కులూ వారివే. ఈ చిత్రానికి మస్తీ, ప్రసన్న విఎం మాటలు రాస్తున్నారు. 'కెజియఫ్' ఫేమ్ శివ కుమార్ కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. మహేంద్ర సింహ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


ఒక్కసారి గ్యాంగ్‌స్టర్‌ అయితే...
'వన్స్ ఎ గ్యాంగ్‌స్టర్‌... ఆల్వేస్ ఏ గ్యాంగ్‌స్టర్‌' - ఇదీ 'ఘోస్ట్' సినిమాకు ఇచ్చిన కొత్త కాప్షన్. 'ఒక్కసారి గ్యాంగ్‌స్టర్‌ అయితే... ఎప్పుడూ గ్యాంగ్‌స్టరే' అని అర్థం అన్నమాట. 'ఘోస్ట్'లో శివ రాజ్ కుమార్ గ్యాంగ్‌స్టర్‌ అని కన్ఫర్మ్ చేశారు. అన్నట్టు... సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్', ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమాల్లో కూడా శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఆ సినిమాల్లో ఆయనవి కీలకమైన పాత్రలు. 


Also Read కమెడియన్ కొడుకుతో హీరోయిన్ ప్రేమకథ - కలిసి నటించలేదు గానీ...


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial