తన సినిమా ప్రమోషన్స్ కోసం బెంగుళూరుకు వెళ్లిన సిద్ధార్థ్.. రాజకీయ సెగను ఎదుర్కున్నాడు. ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కావేరీ జలాల పరిరక్షణ సంఘాలకు చెందిన ప్రతినిధులు వచ్చి ప్రెస్ మీట్‌ను నిలిపివేయమని ఆందోళనకు దిగారు. దీంతో వేరే దారిలేక సిద్ధార్థ్ అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై కన్నడ సినీ పరిశ్రమ స్పందించండి. ముఖ్యంగా శాండిల్‌వుడ్‌లోని ఓ స్టార్ హీరో.. ఈ ఇబ్బందికి సిద్ధార్థ్‌కు సారీ కూడా చెప్పారు.
సిద్ధార్థ్‌కు క్షమాపణలు
సిద్ధార్థ్.. త్వరలోనే ‘చిత్తా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది కేవలం తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా కన్నడలో కూడా విడుదలైంది. ఈ సందర్భంగా బెంగళూరులోని ఓ హోటల్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలిసి.. కొందరు ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు. సిద్ధార్థ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ హీరోవి నీకు ఇక్కడేంటి పని అన్నట్లుగా మాట్లాడారు. దీంతో సిద్ధార్థ్‌కు వేరేదారిలేక లేచి, తన చేతులు జోడించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్.. సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ఇది అవమానకరమైన విద్వేష ప్రదర్శన. కర్ణాటకలో తమిళ ఉద్యమాన్ని ఎందుకు ప్రోత్సాహించలేకపోతున్నారు?’’ అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.
కన్నడ ప్రజలు మంచివారు
‘‘ఈరోజు నా ఇండస్ట్రీ తరపున నేను సిద్ధార్థ్‌కు సారీ చెప్పాలని అనుకుంటున్నాను. నేను చాలా హర్ట్ అయ్యాను. ఇలాంటి తప్పు మళ్లీ జరగనివ్వను. కన్నడ ప్రజలు మంచివారు. వారు అన్ని సినిమాలను, అన్ని భాషలను ఇష్టపడతారు. కర్ణాటక ప్రేక్షకులే అన్ని రకాల సినిమాలను చూస్తారు’’ అంటూ సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పడంతో పాటు కన్నడ ప్రజలను సమర్థించారు శివరాజ్‌కుమార్.
ప్రకాశ్ రాజ్ కూడా
ఓవైపు కర్ణాటకలో కావేరీ మూమెంట్ అనేది జోరుగా సాగుతుంది అన్నమాట నిజమే. కానీ వేరే భాష హీరో వచ్చి బెంగుళూరులో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న క్రమంలో దానికి అంతరాయం కలిగించి మరీ కావేరీ మూమెంట్‌ను సపోర్ట్ చేయమని అడగడం కరెక్ట్ కాదని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా సిద్ధార్థ్ వేరే భాష హీరో కాబట్టి తన సినిమాను అసలు సపోర్ట్ చేయకూడదు అన్న ఉద్దేశ్యంతో కూడా ఇలా చేసుంటారని కొందరు ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. కానీ ఏదైనా చిన్న విషయం నచ్చకపోతే.. వెంటనే సీరియస్ అయ్యే సిద్ధార్థ్ మాత్రం ప్రెస్ మీట్‌లో జరిగిన అంతరాయం గురించి ఇంకా స్పందించడానికి ముందుకు రాలేదు. ఈ విషయంలో కేవలం శివరాజ్‌కుమార్ మాత్రమే కాకుండా ప్రకాశ్ రాజ్ కూడా సిద్ధార్థ్‌కు క్షమాపణలు తెలిపారు.
Also Read: రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial