'గేమ్ చేంజర్' విడుదల తర్వాత తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని 'దిల్' రాజు సోదరుడు శిరీష్ వ్యాఖ్యానించారు. ''సినిమా ఫ్లాప్ అయ్యాక హీరో ఏమైనా హెల్ప్ చేశాడా డైరెక్టర్ చేశాడా కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు'' అంటూ ఘాటుగా స్పందించారు. జూలై 4న నితిన్ హీరోగా నిర్మించిన తాజా సినిమా 'తమ్ముడు' విడుదల కానున్న సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

మెగా అభిమానుల్లో ఆగ్రహం...ఎస్వీసీని బాయ్ కాట్ చేయాలని ఫైర్!శిరీష్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. తమ అభిమాన హీరో రామ్ చరణ్ గురించి గానీ, 'గేమ్ చేంజర్' సినిమా గురించి గానీ మరోసారి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. 'ఖబడ్దార్' అంటూ వార్నింగ్ ఇచ్చారు. చరణ్ మూడేళ్ల సమయాన్ని వృథా చేయడం మాత్రమే కాకుండా ప్రతి రోజూ విషం చిమ్మడం ఏమిటని ఫైర్ అయ్యారు. 'బాయ్ కాట్ ఎస్వీసీ' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. శిరీష్ వ్యాఖ్యల మీద మరొక ఇంటర్వ్యూలో 'దిల్' రాజు వివరణ ఇచ్చినా అభిమానులు సంతృప్తి చెందలేదు. దాంతో శిరీష్ దిగి వచ్చారు. సారీ చెప్పారు. 

Also Read: గేమ్ ఛేంజర్ వివాదంతో "తమ్ముడు" టెన్షన్; దిల్ రాజు-శిరీష్‌పై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్‌, ట్రెండింగ్‌లో బాయ్ కాట్ SVC

Continues below advertisement

మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడము!''అందరికీ నమస్కారం! నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి... దాని వలన కొందరు మెగా అభిమానులు బాధ పడినట్లు తెలిసింది. 'గేమ్ చేంజర్' సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి. ఇట్లు శిరీష్ రెడ్డి'' అంటూ ఒక లెటర్ విడుదల చేశారు.

శిరీష్ రెడ్డి వివరణతో సంతృప్తి చెంది మెగా ఫ్యాన్స్ క్షమిస్తారో? లేదంటే నితిన్ 'తమ్ముడు' సినిమాను బాయ్ కాట్ చేస్తారో? వెయిట్ అండ్ సి.

Also Read: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ భామ... 'విశ్వంభర'లో ఐటమ్ సాంగ్ చేసే అందాల భామ ఎవరంటే?