మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా మొదలు అయిన విషయం అందరికీ తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. మరి, దాని కంటే ముందు మొదలైన - దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'విశ్వంభర' (Vishwambhara Movie) సంగతి ఏంటి? ఆ సినిమా పనులు ఎంత వరకు వచ్చాయి? అంటే...

Continues below advertisement

చిరంజీవితో స్టెప్స్ వేయనున్న మౌనీ రాయ్!'విశ్వంభర' చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. అయితే, ఇందులో ఒక ఐటమ్ సాంగ్ యాడ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ చేస్తున్నారు. అయితే, ఐటమ్ సాంగ్ కోసం మాస్ మ్యూజిక్ సాంగ్స్ చేయడంలో స్పెషలిస్ట్ అయినటువంటి భీమ్స్ సిసిరోలియోను అప్రోచ్ అయ్యింది టీమ్. చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయనతో 'విశ్వంభర' ఐటమ్ సాంగ్ కూడా చేయిస్తున్నారు. 

'విశ్వంభర' సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం పలువురు అందాల భామల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఒకానొక సమయంలో కన్నడ నటి నివిష్క నాయుడు కన్ఫర్మ్ అయినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే, చివరకు ఆ ఛాన్స్ బాలీవుడ్ భామ మౌనీ రాయ్ (Mouni Roy In Vishwambhara)ను వరించిందని తెలిసింది. 'నాగిన్‌'తో పాటు టీవీ సీరియళ్లు, రియాలిటీ షోలతో పాపులరైన మౌనీ రాయ్... 'కేజీఎఫ్' హిందీ వెర్షన్ ఐటమ్ సాంగ్ చేశారు. 'బ్రహ్మాస్త్ర'లో విలన్ రోల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

Continues below advertisement

Also Readరామ్ చరణ్ హెల్ప్ చేయలేదు... ఫ్లాప్ తర్వాత ఒక్క ఫోన్ రాలేదు - నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు

వీఎఫ్ఎక్స్ పనులు కొలిక్కి... త్వరలో సినిమా పూర్తి!'విశ్వంభర'ను ఎప్పుడో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ఆశించినట్టు రాకపోవడంతో విడుదల వాయిదా వేశారు. ఫారిన్ కంపెనీల చేత మళ్లీ వర్క్ చేయించారు. ఇప్పుడు ఆ పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ ఫినిష్ అయ్యాక విడుదల తేదీ మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

'బింబిసార' బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకం మీద విక్రమ్, వంశీ, ప్రమోద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్ మరొక హీరోయిన్. సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో