Sherlyn Chopra: బాలీవుడ్ లో వివాదాస్పద నటల్లో షెర్లిన్ చోప్రా కూడా ఒకరు. బోల్డ్ బ్యూటీగా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన వ్యాఖ్యలతో కూడా ఒక్కోసారి వార్తల్లో నిలుస్తుంది. అవి కాస్తా కాంట్రవర్సీకు దారితీస్తుంటాయి కూడా. అలాంటి సందర్బాలు గతంలోనూ ఉన్నాయి. షెర్లిన్ చోప్రా ప్రస్తుతం ఓటీటీలో విడుదల కానున్న ‘పౌరాష్పూర్ 2’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో ఆమె క్వీన్ స్నేహలత పాత్రలో కనిపించునుంది. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షెర్లిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


వాటిని ఓసారి తాకవచ్చా అని అడిగారు: షెర్లిన్ చోప్రా


రీసెంట్ గా సిద్దార్థ్ కన్నన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెర్లిన్ చోప్రా కొందరు దర్శకుల నుంచి అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నానని చెప్పింది. తన బ్రెస్ట్ పరిమాణం గురించి కొందరు దర్శకులు అడిగారని చెప్పింది. ‘‘నువ్వు నీ బ్రెస్ట్ కోసం ఆపరేషన్ చేయించుకున్నావా’’ అని అడిగారని, అయితే దానికి తాను అబద్దం చెప్పడానికి కారణాలు ఏమీ లేవని ఫీల్ అయ్యానని అందుకే ‘‘అవును నా బ్రెస్ట్ ఫ్లాట్ గా ఉండటం నాకు నచ్చలేదు, అందుకే చేయించుకున్నాను’’ అని సమాధానం చెప్పానని చెప్పింది. దానికి ఆ దర్శకుడు ‘‘వాటిని ఓసారి తాకవచ్చా? నీ కప్ సైజ్ ఎంత?’’ అని అసభ్యకరంగా మాట్లాడారని గుర్తు చేసుకుంది. ఆ దర్శకుడు అలా మాట్లాడం చూసి తాను ఆశ్చర్యపోయానని, నిజంగా ఒక నటి కప్ సైజ్ తెలుసుకున్నాకే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా అని ప్రశ్నించానని చెప్పింది. ‘‘మీకు పెళ్లి అయింది. మీకు స్త్రీ శరీర నిర్మాణం గురించి తెలిసి ఉంటుంది కదా’’ అని ఆ దర్శకుడిని అడిగితే.. ‘‘ అవునా? అయినా నేను నా భార్యతో ఎక్కువగా మాట్లాడను’’ అంటూ ఆ దర్శకుడు సమాధానం చెప్పాడని చెప్పింది షెర్లిన్. 


నేనెప్పుడూ దానికి లొంగలేదు..


ఇదే ఇంటర్వ్యూలో షెర్లిన్ చోప్రా మానసిక ఆందోళన గురించి కూడా మాట్లాడింది. తాను ఎన్నో సార్లు మానసికంగా ఆందోళనకు గురయ్యానని, మనలో చాలా మందికి ఇలా జరుగుతుందని చెప్పింది. అయితే పరిస్థితులకు తలవంచకూడదని ఇలాంటి పరిస్థితులు వస్తుండాలి, పోతుండాలి అని వ్యాఖ్యానించింది. తాను మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు తనను డ్రగ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారని, కానీ తాను దానికి ఎప్పుడూ లొంగలేదని చెప్పింది. అలాగే 2021 లో తనకు కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు తన పని అయిపోయిందని అనుకున్నానని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో తన కుటుంబం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేకపోయినా కనీసం ఎవరూ తనను పట్టించుకోకపోయినా నిరాశపడలేదని చెప్పింది. ధైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పింది. ఎందుకంటే తన జీవితంలో ఒక్క రోజు కూడా వృథా చేయకూడదని నిర్ణయించుకున్నానని, తన జీవితాన్ని సంపూర్ణంగా గడపాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది షెర్లిన్. ప్రస్తుతం షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


Also Read: నారా రోహిత్ ఈజ్ బ్యాక్ - కొత్త సినిమా ప్రకటన, 2024 ఎన్నికల కోసమేనా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial