Nara Rohit: టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మూవీస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో విభిన్నమైన కథలతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ నారా వారి హీరో గత కొన్నాళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన పూర్తిగా సినిమాల నుంచి తప్పుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా నారా రోహిత్ మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘నారా రోహిత్ 19’కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జర్నలిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. 


పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో మూవీ..


నారా రోహిత్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆయన నుంచి రాబోతున్న కొత్త మూవీకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ నెల 24న సాయంత్రం 4 pmకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ ను చూస్తే పొలిటికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో 'ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు' అని కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఉంటుందని అంటున్నారు. అయితే నారా రోహిత్ గతంలో నటించిన ‘ప్రతినిధి’ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ అనే టాక్ కూడా నడుస్తోంది. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


2024 ఎన్నికలు కోసమేనా?


టాలీవుడ్ లో ఉన్న విలక్షణమైన నటుల్లో నారా రోహిత్ ఒకడని చెప్పొచ్చు. ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. అందులోనూ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఉన్న సినిమాలకు నారా రోహిత్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతాడు. అయితే ఇప్పుడు నారా రోహిత్ కొత్త సినిమాపై కూడా అటు ఫిల్మ్ వర్గాల్లో ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చ మొదలైంది. ఈ సినిమాను 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గానే ఈ మూవీ తీస్తున్నారని అంటున్నారు. అందుకే రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో నారా చంద్రబాబు నాయుడు ‘విక్టరీ’ సింబల్ ను సింబాలిక్ గా చూపించారు అనే వాదనలు కూడా ఉన్నాయి. దానికి తోడు 2014 ఎన్నికలకు ముందు ‘ప్రతినిధి’ అనే సినిమాను తీసుకొచ్చారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు సినిమాను అనౌన్స్ చేయడం, పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఉంటుందని తెలియడంతో మూవీపై చర్చ నడుస్తోంది. అందులోనూ జర్నలిస్ట్ గా ఉన్న మూర్తి సడెన్ గా దర్శకుడిగా మారడంతో ఈ సినిమాలో కచ్చితంగా కరెంట్ పాలిటిక్స్ ను ప్రభావితం చేసేలా సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.  ఈ సినిమాను వానరా ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించనున్నారు.






Also Read: ‘ఓపెన్‌హైమర్’ మూవీ‌లో ‘భగవద్గీత’కు అవమానం, ఆ శృంగార సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial