'నారీ నారీ నడుమ మురారి' అంటున్నారు యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand). గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా టైటిల్ తన కొత్త సినిమాకు ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా పేరుకు తగ్గట్టు అందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు సంయుక్త కాగా... మరొకరు సాక్షి వైద్య. దీంతో పాటు మరొక కొత్త సినిమాలో కూడా ఆయన సరసన ఇద్దరు అందాల భామలు నటించనున్నారు.
సంపత్ నంది సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు!
'నారీ నారీ నడుమ మురారి' కాకుండా 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు. అందులో మాళవిక నాయర్ హీరోయిన్. అది కాకుండా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నందితో ఒక సినిమా చేసేందుకు శర్వానంద్ ఓకే చెప్పారు.
సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో చేయనున్న సినిమా శర్వానంద్ 38వ సినిమా (Sharwa 38 Movie). ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఏప్రిల్ మంత్ ఎండ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ పతాకం మీద కేకే రాధా మోహన్ నిర్మిస్తున్న చిత్రమిది. అందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలిసింది.
కథానాయకుడిగా శర్వానంద్ ప్రయాణంలో 'శతమానం భవతి' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. జాతీయ పురస్కారం సాధించిన ఆ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. ఇప్పుడు మరోసారి సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ జంటగా ఆవిడ కనిపించును ఉన్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
Also Read: ఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?
శర్వా సినిమాలో ఫ్లాప్ పోరి డింపుల్ హయాతి!
అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ అయితే... డింపుల్ హయాతి (Dimple Hayathi) మరొక హీరోయిన్ అని తెలిసింది. ఆవిడ కథానాయికగా నటించిన లాస్ట్ మూడు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో స్పెషల్ సాంగ్ 'సూపర్ హిట్టు' ఆవిడను పాపులర్ చేసింది.
Also Read: మీనాను అవమానించిన నయనతార... రెజీనా సెల్ఫీ తీయడంతో అసంతృప్తి, అలక?
'గద్దలకొండ గణేష్' సినిమాలో స్పెషల్ సాంగ్ తర్వాత హీరోయిన్ రోల్స్ చేసిన విశాల్ 'సామాన్యుడు', మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి', మ్యాచ్ హీరో గోపీచంద్ 'రామబాణం' సినిమాలో డిజాస్టర్లు అయ్యాయి. అయినా సరే డింపుల్ హయాతి మీద హీరో శర్వానంద్ దర్శకుడు సంపత్ నంది నమ్మకం ఉంచారు. ఆవిడకు తమ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.