సంక్రాంతికి 'నారి నారి నడుమ మురారి'తో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand). తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన... ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' సినిమా చేస్తున్నారు. ఇవాళ ఆ సినిమాలో శర్వానంద్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

'భోగి'లో శర్వా లుక్ చూశారా?శర్వానంద్, సంపత్ నంది కలయికలో రూపొందుతున్న మొదటి సినిమా 'భోగి'. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం మీద శ్రీమతి లక్ష్మి రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవాళ సినిమాలో ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 

'భోగి' ఫస్ట్ లుక్ చూస్తే... శర్వానంద్ రగ్గడ్, ఫిరోషియస్ ఎక్స్‌ప్రెషన్‌లో కనిపించారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ స్పష్టంగా కనబడుతోంది. 'నారి నారి నడుమ మురారి'లో లవర్ బాయ్ పాత్రలో హ్యాండ్సమ్ లుక్కులో కనిపించిన ఆయన... ఇప్పుడు మాస్ హీరో అవతార్ చూపించారు. 

'భోగి' ఫస్ట్ లుక్కులో సినిమా ఎంత మాసీగా ఉండబోతుందో చూపించారు. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' తరహాలో డార్క్ టోన్ సినిమాటోగ్రఫీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వయలెన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుందట. ఈ సినిమాకు ఏ 'బ్లడీ ఫెస్ట్' అని ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి రగ్గడ్ రోల్ ఈ సినిమాలో శర్వా చేస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది.

Also ReadBalakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

'భోగి' నేపథ్యం ఏమిటి?ఈ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల నేపథ్యంలో 'భోగి' కథ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. పవర్ ఫుల్ కథతో 1960 నేపథ్యంలో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సంపత్ నంది కథ రాశారట. 

'భోగి' సినిమాలో శర్వానంద్ సరసన అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో మేజర్ యాక్షన్ సీక్వెన్సులు షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రెండు యాక్షన్ సీక్వెన్సులు తీయనున్నారు. వీటికి దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Also ReadNTR - Ravi Teja: ర‌వితేజతో అనౌన్స్ చేశారు... ఎన్టీఆర్‌తో సినిమా చేశారు... కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా బ్యాక్‌స్టోరీ తెలుసా?

ఈ ఏడాది ఆగస్టు 28న 'భోగి'ని థియేటర్లలోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'భోగి'ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. 

శర్వానంద్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న 'భోగి' చిత్రాన్ని రచన - దర్శకత్వం: సంపత్ నంది, నిర్మాత: కేకే రాధామోహన్, నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: కిశోర్ కుమార్ ఆరోకియా, కళా దర్శకుడు: కిరణ్ కుమార్ మన్నే, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్.

Also Read: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్ టైటిల్ ఫిక్స్... కడప నేపథ్యంలో!