మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమాల్లో 'టెంప‌ర్' (Temper Movie) ఒక‌టి. వ‌రుస‌గా ఆరు డిజాస్ట‌ర్ల‌తో కెరీర్ డైల‌మాలో ప‌డిన టైమ్‌లో 'టెంప‌ర్‌'తో అదిరిపోయే క‌మ్‌ బ్యాక్ ఇచ్చాడు ఎన్టీఆర్‌. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆ సినిమాలోని ద‌యా పాత్ర‌లో ఎన్టీఆర్ మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్ డెలివ‌రీ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

'టెంపర్'లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. పాన్ ఇండియ‌న్ హీరో దిశ‌గా 'టెంప‌ర్‌'తోనే ఎన్టీఆర్ తొలి అడుగు ప‌డింది.

'టెంపర్'లో హీరోగా ఫ‌స్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదు!ఎన్టీఆర్ (Temper background story)కు ఇంత‌గా క‌లిసొచ్చిన 'టెంప‌ర్‌'లో హీరోగా ఫ‌స్ట్ ఛాయిస్ మాత్రం ఆయన కాదు. 'టెంప‌ర్' క‌థ‌తో మాస్ మహారాజా ర‌వితేజ సినిమా చేయాల్సింది. అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసిన త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ర‌వితేజ ప‌క్క‌న‌పెట్టిన క‌థ‌తో ఎన్టీఆర్ హిట్టు కొట్టారు.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో రవితేజ 'ప‌వ‌ర్'...ఆ కథే ఎన్టీఆర్‌తో 'టెంపర్'గా తీసిన పూరి!'కంత్రి', 'బిల్లా' సినిమాల ఫేమ్ మెహ‌ర్ ర‌మేష్‌తో ఓ సినిమా చేయ‌డానికి ర‌వితేజ గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చారు. ఆ మూవీ కోసం ర‌వితేజ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా వ‌క్కంతం వంశీ ఓ ప‌వ‌ర్‌ ఫుల్ స్టోరీని రెడీ చేశారు. సినిమాకు 'ప‌వ‌ర్' అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ర‌వితేజ మార్కెట్‌కు మించి బ‌డ్జెట్ అవుతుండ‌టంతో రిస్క్ అనే ఆలోచ‌న‌తో చివ‌రి నిమిషంలో నిర్మాత‌లు ప‌వ‌ర్ సినిమాను ప‌క్క‌న‌పెట్టారు.

Also Read: Balakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

సరిగ్గా ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న డైరెక్ట‌ర్‌ పూరి జ‌గ‌న్నాథ్ క‌థ‌ కోసం వ‌క్కంతం వంశీని అప్రోచ్ అయ్యార‌ట‌. పూరికి త‌న ద‌గ్గ‌ర ఉన్న చాలా క‌థ‌లు చెప్పాడ‌ట వ‌క్కంతం వంశీ. కానీ అవేవీ పూరికి అంత‌గా న‌చ్చ‌లేదు. దాంతో ర‌వితేజ కోసం సిద్ధం చేసిన 'ప‌వ‌ర్' క‌థ‌ను పూరికి వినిపించాడు. ఈ క‌థ పూరి జ‌గ‌న్నాథ్‌తో పాటు ఎన్టీఆర్ తెగ న‌చ్చింద‌ట‌. దాంతో ఈ క‌థ‌నే 'టెంప‌ర్' కోసం ఫైన‌ల్ చేశారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా 'టెంప‌ర్' క‌థ‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను తెర‌కెక్కించారు పూరి జ‌గ‌న్నాథ్. అలా ర‌వితేజ కోసం అనుకున్న క‌థ‌తో ఎన్టీఆర్ సినిమా చేసి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.

మెహ‌ర్ ర‌మేష్ చేయాల్సిన సినిమా టైటిల్ 'ప‌వ‌ర్‌'తోనే ఆ త‌ర్వాత కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్ష‌న్‌లో ర‌వితేజ ఓ మూవీ చేసి విజ‌యాన్ని అందుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read: Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?