Tollywood Flashback: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాల‌కృష్ణ‌, విక్టరీ వెంక‌టేష్‌... ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. రెండు తరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొన‌సాగుతోన్నారు. ఇద్ద‌రిలో బాల‌కృష్ణ మాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిస్తే... వెంక‌టేష్ ఫ్యామిలీ సినిమాలతో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. అయితే... వీళ్ళిద్దరూ ఒకే కథతో రెండు సినిమాలు చేశారు. ఆ రెండూ బాక్స్ ఆఫీస్ బరిలో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మరి, ఆయా సినిమాల రిజల్ట్ ఏమిటో తెలుసుకోండి. 

Continues below advertisement

కథ ఒక్కటే... రిలీజ్ డేట్ కూడా!బాక్సాఫీస్ బరిలో బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ త‌మ సినిమాల‌తో పోటీ ప‌డ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ క్లాష్‌లో ఇద్ద‌రూ విన్న‌ర్స్‌గా నిలిచిన సంద‌ర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఓ సారి మాత్రం వీరిద్ద‌రి బాక్సాఫీస్ పోటీ కాస్త వివాదానికి దారి తీసింది. ఆ గొడవకు కారణం... ఇద్దరి సినిమాల్లో కథ ఒక్కటే కావడం! అందులో వెంక‌టేష్ సినిమా బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ అవ్వగా... బాల‌కృష్ణ మూవీ మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది.

ధ్రువ నక్షత్రం వర్సెస్ అశోక చక్రవర్తి!బాల‌కృష్ణ హీరోగా న‌టించిన 'అశోక చ‌క్ర‌వ‌ర్తి' సినిమా జూన్ 29, 1989న విడుదల అయ్యింది. అదే రోజు వెంక‌టేష్ 'ధ్రువ‌ న‌క్ష‌త్రం' కూడా థియేట‌ర్ల‌లోకి వచ్చింది. విడుదలకు ముందు ఈ రెండు సినిమాల‌పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ మొదటి రోజు థియేట‌ర్ల‌లో 'అశోక చ‌క్ర‌వ‌ర్తి', 'ధ్రువ‌ న‌క్ష‌త్రం' సినిమాల‌ను చూసిన ఫ్యాన్స్ మాత్రం షాక్ అయ్యారు. అందుకు కారణం కథ. 

Continues below advertisement

Also ReadHey Balwanth Review - 'హే బల్‌వంత్' రివ్యూ: సుహాస్ సినిమా హిట్టా? ఫట్టా? బిజినెస్ అంటూ చేసిన కామెడీ ఎలా ఉందంటే?

మలయాళ స్టార్ మోహ‌న్‌ లాల్ హీరోగా న‌టించిన 'ఆర్య‌న్' ఆధారంగా బాలయ్య 'అశోక చ‌క్ర‌వ‌ర్తి', వెంకటేష్ 'ధ్రువ‌ న‌క్ష‌త్రం' రూపొందాయి. అదీ అసలు సంగతి!

బాలయ్యది అఫీషియల్ రీమేక్...వెంకటేష్ సినిమా మాత్రం స్ఫూర్తి!మ‌ల‌యాళ సినిమా 'ఆర్యన్'కు బాలకృష్ణ 'అశోక చ‌క్ర‌వ‌ర్తి' అఫీషియ‌ల్ రీమేక్. 'ధ్రువ నక్షత్రం' రీమేక్ కాదు. 'ఆర్య‌న్' స్ఫూర్తితో తెర‌కెక్కించారు. ఓ సామాన్య యువ‌కుడు తాను చేయ‌ని నేరానికి జైలుకు వెళ్లి... అనుకోని ప‌రిస్థితుల్లో ముంబై మాఫియా  డాన్‌గా ఎలా మారాడు? అనేది రెండు సినిమాల్లో క‌థ‌.

ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో 'అశోక చ‌క్ర‌వ‌ర్తి' మొద‌లు అవుతుంది. సెంటిమెంట్‌కు ప్రాధాన్య‌ం ఇస్తూ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. ర‌విచంద్ర సినిమాను రూపొందించారు. 'ధ్రువ‌ న‌క్ష‌త్రం'ను స్టైలిష్ యాక్ష‌న్ సినిమాగా దర్శకుడు వై నాగేశ్వ‌ర‌రావు రూపొందించారు. కొన‌మెరుపు ఏమిటంటే... ఈ రెండు సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ, మాట‌లు అందించారు. రెండు సినిమాల కథ ఒక్కటేనని వాళ్లకు తెలిసినప్పటికీ బ‌య‌ట‌కు చెప్ప‌లేద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వ‌చ్చాయి.

Also Read: Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

బాలకృష్ణ, వెంకటేష్ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా వస్తే బావుంటుందని అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చేస్తున్నారు. ఇటీవ‌ల బాల‌కృష్ణ‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వెంక‌టేష్ ప్ర‌క‌టించి స‌ర్‌ప్రైజ్ చేశారు. అయితే ఆ సినిమా ఏది? ఎప్పుడు వస్తుంది? అనేది మాత్రం వెంక‌టేష్ రివీల్ చేయ‌లేదు.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా