మీకు మోడల్ కమ్ హీరోయిన్ డాలీ షా (Dollysha) అలియాస్ షాలు చౌరాసియా (Shalu Chourasiya) తెలుసా? తెలుగులో ఆమె నటించిన సినిమాలు తక్కువే. చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. నటిగా కంటే పోలీసులకు కంప్లైంట్స్ ఇవ్వడం ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్టుగా ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ చూస్తే...
 
కేబీఆర్ పార్కులో వెంబడించారు!
కేబీఆర్ పార్క్ (Kasu Brahmananda Reddy National Park) లో వాకింగ్ చేస్తున్న సమయంలో ఎవరో ఆగంతకుడు తనను వెంబడించారని డాలీ షా బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని యువకుడి ప్రవర్తనపై తనకు అనుమానం వచ్చి నడక ఆపితే అతడూ ఆపాడని, మళ్ళీ తాను నడక కొనసాగిస్తే అతడూ కొనసాగించాడని ఆమె పేర్కొన్నారు. 


సేమ్ పార్క్... సేమ్ టైప్ కంప్లైంట్!
డాలీ షా గురించి తెలిసిన వాళ్ళకు, క్రైమ్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకు... ఇది కొత్త కంప్లైంటా? లేదంటే పాత కంప్లైంట్ మళ్ళీ వార్తల్లోకి వచ్చిందా? అని కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. అది వాస్తవం. ఎందుకు అంటే... సేమ్ పార్కులో సేమ్ టైప్ కంప్లైంట్ ఆమె ఇచ్చారు గనుక!


పదిహేడు నెలలు వెనక్కి వెళితే... నవంబర్ 2021లో కూడా కేబీఆర్ పార్కులో తనపై ఒకరు లైంగిక దాడికి పాల్పడినట్లు షాలు చౌరాసియా బంజారా హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పుడు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... 


తాను కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా దుండగుడు ఒకరు దాడి చేసి, ఆమె ఖరీదైన ఫోన్‌ను లాక్కుని వెళ్ళారని షాలు చౌరాసియా తెలిపారు. అప్పట్లో ఆ ఘటనపై ఆమె మాట్లాడుతూ... ''నేను ఎప్పటిలాగే కేబీఆర్ పార్క్‌లో సాయంత్రం 6 గంటలకు వాకింగ్ కోసం వెళ్ళాను. రాత్రి 8 గంటల సమయంలో పార్క్ నుంచి బయటకు వస్తుంటే, ఒక వ్యక్తి నాపై దాడి చేశాడు. మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. నా ముఖంపై బలంగా పిడిగుద్దులు కురిపించాడు'' అని పేర్కొన్నారు. 


''నా దగ్గర డబ్బులు లేవని, ఫోన్ పే చేస్తానని దాడి చేస్తున్న వ్యక్తికి చెప్పాను. అతని ఫోన్ నెంబర్ చెప్పమని అడిగా. అదే ఆ టైంలో రెండు సార్లు 100 కి డయల్ చేశా. నేను 100 నెంబరుకి డయల్ చేయడం చూసి... నన్ను పొదల్లోకి తోసేశాడు. పెద్ద బండరాయి తలపై వేయబోయాడు.  నేను దాన్నుంచి పక్కకు తప్పుకుని, దుండగుడి ప్రైవేట్ పార్ట్స్‌ మీద కాలితో తన్నా. ఆ తర్వాత ఫెన్సింగ్ దూకి తప్పించుకుని బయటికి వచ్చేశా. ఎదురుగా ఉన్న స్టార్‌ బక్స్‌ వద్ద ఉన్న డ్రైవర్లు వచ్చారు. వారి ఫోన్‌ నుంచే తీసుకొని పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాను. పోలీసులు వెంటనే స్పందించారు. ఆగంతుకుడు ఐదు అడుగుల ఎత్తులో ఉంటాడు. 22 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుంది. మరోసారి చూస్తే తప్పకుండా గుర్తు పడతా'' అని షాలు చౌరాసియా పేర్కొన్నారు. అప్పట్లో సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. 


Also Read 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే? 


సీసీ కెమెరాలు పరిశీలించగా... ఆగంతకులు ఫాలో అయినట్లు ఏమీ లేదని లేటెస్ట్ కంప్లైంట్ గురించి పోలీసులు స్పందించినట్లు సమాచారం అందుతోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అందువల్ల, ఇది పబ్లిసిటీ స్టంటా? లేదంటే నిజామా? అనే సందేహాలు కలుగుతున్నాయి. బొటానికల్ గార్డెన్ నుంచి కేబీఆర్ పార్కుకు డాలీ షా వాకింగ్ కోసం వస్తున్నారట. గతంలో 'శైలు', 'సైకో' వంటి సినిమాల్లో నటించిన డాలీ షా... వరుణ్ సందేశ్ సరసన 'డైమండ్ రాజా' సినిమా చేశారు.  


Also Read : కండలు పెంచిన మహేష్ బాబు - జిమ్‌లో సూపర్ స్టార్