సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మహా సిగ్గరి. రీల్ లైఫ్, రియల్ లైఫ్... షర్ట్ విప్పి ఎప్పుడూ కెమెరా ముందుకు వచ్చింది లేదు. 'వన్ నేనొక్కడినే' సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయాలని అనుకున్నారు. ఫేస్ కొంచెం హార్డ్ కావడంతో ఆ ప్రయత్నాన్ని మానేశారు. అయితే, మహేష్ బాబు ఫిట్నెస్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపిస్తే చూడాలనేది ఘట్టమనేని అభిమానుల కోరిక. సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపిస్తారో గానీ... త్వరలో బైసెప్స్ చూపించే అవకాశం ఉంది. 


కండలు చూపించిన మహేష్!
Prince Mahesh Babu : ఈ రోజు సోషల్ మీడియాలో మహేష్ బాబు రెండు ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ రెండు చూస్తే... ఒక విషయం క్లారిటీగా కనబడుతుంది. ఆయన బైసెప్స్. స్లీవ్ లెస్ టీ షర్టులో మహేష్ కండలు చూపిస్తూ కనిపించారు. అయితే, ఈ కండలు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న తాజా సినిమా కోసమా? ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో చేయబోయే పాన్ ఇండియా / వరల్డ్ సినిమా కోసమా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. అప్పటి వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రస్తుతం అయితే ఈ ఫోటోలు నెట్టింట్లో ఒక స్థాయిలో వైరల్ అవుతున్నాయి. 'ఆర్మ్ డే' అంటూ మహేష్ బాబు ఈ ఫోటోలు షేర్ చేశారు. 


Also Read 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?   






మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తెరకెక్కిస్తున్న తాజా సినిమా విషయానికి వస్తే... ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. హైదరాబాదులో కొన్ని రోజుల క్రితం ప్రధాన తారాగణంపై కీలకమైన సీన్లు తీశారు. సోమవారం నుంచి తాజా షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ నగర శివరాల్లో సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన బంగ్లాలో సీన్లు తీస్తున్నారు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.  


మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దాంతో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది. 


Also Read విలన్‌గా 'వెన్నెల' కిశోర్? - సారీ ఫ్యాన్స్, అది రాంగే! 


మహేష్, త్రివిక్రమ్ సినిమా ఓటీటీ రైట్స్ 80 కోట్ల రూపాయలు పలికినట్లు, ఇది అన్ని భాషలకు కలిపి అని సమాచారం. దీంతో మహేష్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ వచ్చినట్టు లెక్క. హీరో, డైరెక్టర్ కాంబినేషన్ చూస్తే... థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరుగుతుందని అంచనా. సో... విడుదలకు ముందు నిర్మాతలకు ప్రాఫిట్ గ్యారెంటీ.