Shaitaan movie 2024 X Reviews In Telugu: అజయ్ దేవగణ్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా 'సైతాన్'. మాధవన్ విలన్ రోల్ చేశారు. సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రమిది. నేడు థియేటర్లలోకి విడుదలైంది. ఈ మూవీకి బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. 


3 స్టార్స్ రేటింగ్ ఇచ్చిన ఏబీపీ న్యూస్!
'సైతాన్' సినిమా భయపెడుతుందని, అదే సమయంలో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందని ఏబీపీ న్యూస్ క్రిటిక్ అమిత్ భాటియా పేర్కొన్నారు. మాధవన్, అజయ్ దేవగణ్ అద్భుతంగా నటించారని తెలిపారు. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ... ప్రేక్షకులు అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిదని అమిత్ వివరించారు. ఆయన వీడియో రివ్యూ చూడటం కోసం ట్విట్టర్‌లో లింక్ క్లిక్ చేయండి.


Also Read: భీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా? ఫట్టా?






డ్రామా... థ్రిల్స్... చిల్స్... షాక్ వేల్యూ!
ఒక్క మాటలో చెప్పాలంటే 'సైతాన్' సినిమా విన్నర్ అని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్, క్రిటిక్ తరణ్ ఆదర్శ్ చెప్పారు. డ్రామా, థ్రిల్స్, చిల్స్, షాక్ వేల్యూ... ఈ సినిమాలో అన్నీ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులు సినిమాకు బలం అని ఆయన వివరించారు.


నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రిగా అజయ్ దేవగణ్, ఓవర్ ది బోర్డు వెళ్లకుండా శాడిస్ట్ పాత్రలో ఆర్ మాధవన్ అద్భుతంగా నటించారని తరణ్ ఆదర్శ్ తెలిపారు. ఎన్నో రోజుల తర్వాత జ్యోతికను హిందీ తెరపై చూడటం బావుందన్నారు. అమిత్ త్రివేది టెర్రిఫిక్ రీ రికార్డింగ్ ఇచ్చారని చెప్పారు.


Also Readగామి రివ్యూ: అఘోరాగా విశ్వక్‌ సేన్ నటించిన సినిమా ఎలా ఉంది? హిట్టా







మాధవన్ నటన 'సైతాన్'కు హైలైట్ అని నెటిజనులు చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో 20 నిమిషాల పాటు ఇరగదీశారట. బాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది 'సైతాన్' సినిమాకు 4 స్టార్స్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ సైతం బావుందని బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే అర్థం అవుతోంది.


Also Read: వళరి రివ్యూ... ETV Winలో హారర్ థ్రిల్లర్ - రితికా సింగ్ కొత్త సినిమా బావుందా? భయపెడుతుందా?