Jawan Release Date: ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్నదే నిజం అయింది. షారుక్ ఖాన్ ‘జవాన్’ విడుదల తేదీ మారింది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు స్వయంగా షారుక్ ఖాన్ అధికారికంగా ప్రకటించాడు. నిజానికి ఈ సినిమా జూన్ 2వ తేదీన విడుదల కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడం, వీఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అవ్వడంతో విడుదల తేదీ వాయిదా వేయక తప్పలేదు.


శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా ‘జవాన్’ ఎంట్రీ ఇవ్వనున్నాడు. జవాన్ విడుదల తేదీ మారడంతో ఇప్పుడు చాలా సినిమాలు తమ విడుదల తేదీలను తిరిగి మారుస్తున్నాయి. జూన్ 2వ తేదీన విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ రొమాంటిక్ కామెడీ ‘లూకా చుప్పీ 2’ విడుదల కానుందని తెలుస్తోంది. మొదటి భాగంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా కనిపించారు.






‘జవాన్’ వాయిదా ఎప్పట్నుంచో రూమర్స్‌లో ఉంది. మార్చి నుంచే ‘జవాన్’ అనుకున్న తేదీని అందుకోలేదని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే ఏప్రిల్‌లో కూడా సినిమా షూటింగ్‌ను కొనసాగించారు. ఏప్రిల్ నెలాఖరులో షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది.


‘జవాన్’ వాయిదాకు కారణం ఏంటి?
షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.  ఇప్పటికే ‘జవాన్’ మూవీ జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ, ప్రస్తుతం ఈ సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా రిలీజ్ సుమారు రెండు నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. దానికి కారణం ఈ సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి VFX వర్క్‌  పూర్తి చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా తప్పని సరి అయ్యిందట. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే అంశంపై క్లారిటీ రాలేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఆగష్టులో ఈ సినిమా విడుదల ఉండవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.  


‘జవాన్’ సినిమా వీడియో క్లిప్స్ లీక్
రీసెంట్ గా ‘జవాన్’ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. వీటిలో ఒక వీడియోలో షారూఖ్ ఖాన్ ఫైట్ సీన్లు చేస్తున్నట్లు ఉండగా, మరో వీడియోలో నయనతారతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్నది. ఈ క్లిప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశంపై షారుఖ్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయ స్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.  ‘జవాన్’ మూవీకి సంబంధించి కంటెంట్ ను వెబ్‌సైట్‌లు, కేబుల్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లు, డైరెక్ట్ టు హోమ్ సర్వీస్‌లతో సహా ఎలాంటి స్ట్రీమిండ్ ప్లాట్‌ఫారమ్‌ లు ప్రసారం చేయకూడదని ఆదేశించింది.  అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన  వైరల్ వీడియో క్లిప్‌లను తొలగించాలని యూట్యూబ్, గూగుల్, ట్విట్టర్,  రెడ్డిట్ సహా పలు  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోర్టు ఆదేశించింది.