ఇటీవల కాలంలో వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సినిమా 'ది కేరళ స్టోరీ'. కోర్టు కేసులు, నిఘా వర్గాల హెచ్చరికలు, దేశవ్యాప్త ఆందోళనలు, రాజకీయ పార్టీల నుండి వ్యతిరేకత, భారీ విమర్శలు నిరసనల మధ్య ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే, తొలి రోజే రూ. 8 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. కేరళలోని హిందూ యువతులను ముస్లింలుగా మార్చడం, లవ్ జీహాద్, అత్యాచారాలు, రాడికలైజేషన్, ఐసిస్ (ISIS) రిక్రూట్మెంట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కీలక ప్రధాన పాత్ర పోషించిన గ్లామరస్ బ్యూటీ అదా శర్మ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. పుష్కరకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు, ఈ ఒక్క చిత్రంతో వచ్చింది. దీంతో ఇప్పుడు ఆదాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


1. అదా శర్మ ఫ్యామిలీ
ఆదా ముంబైలో 1992 మే 11న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి SL శర్మ, తమిళనాడుకు చెందినవారు. ఇండియన్ మర్చంట్ నేవీలో కెప్టెన్‌ గా ఉన్నారు. అలానే ఆమె తల్లి షీలా శర్మ కేరళకు చెందిన ఒక శాస్త్రీయ నృత్యకారిణి. 


2. అదా శర్మ ఎడ్యుకేషన్
ముంబైలో టెన్త్ క్లాస్ వరకూ చదివిన తర్వాత, చదువు మానేసి మోడలింగ్ లోకి రావాలని అనుకుంది ఆదా. అయితే తల్లి తండ్రుల ఒత్తిడితో ఇంటర్మీడియేట్ పూర్తి చేసి, చదువులకు స్వస్తి పలికింది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే మక్కువ కలిగిన అదా.. కథక్‌ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె సల్సా, జాజ్, బ్యాలెట్, బెల్లీ వంటి ఇతర డ్యాన్స్ లను కూడా నేర్చుకుంది. జిమ్నాస్టిక్స్ లోనూ ప్రావీణ్యం సంపాదించింది. ఆ తర్వాత మోడలింగ్‌ లో అడుగుపెట్టి, ఆపై సినిమాల్లో అవకాశాలను పట్టేసింది. 






3. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ
సినీ ఇండస్ట్రీలోకి రావాలని ఫిక్స్ అయిన తర్వాత అదా శర్మ, చాలా సినిమాలకు ఆడిషన్ ఇచ్చింది. కానీ ఆమె కర్లీ హెయిర్ కారణంగా, చాలా యంగ్ గా కనిపించడంతో కాస్టింగ్ డైరెక్టర్లు హీరోయిన్ రోల్స్ కి రిజెక్ట్ చేసారు. చివరికి ఈ బ్యూటీ 2009లో విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన '1920' అనే హిందీ హారర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రజనీష్ దుగ్గల్ కు జోడీగా కనిపించింది. అయితే ఈ సినిమా సరైన సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లపాటు హీరోయిన్ ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. 
 
4. తెలుగు సినిమా ఆఫర్స్
2014లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది ఆదా శర్మ. ఆ తర్వాత అల్లు అర్జున్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి', సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆది సాయి కుమార్‌ ‘గరం’, అడివి శేష్‌ తో ‘క్షణం’, రాజశేఖర్‌ తో ‘కల్కి’ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. అందాల ఆరబోతకు అడ్డుచెప్పకపోయినా, ఎందుకనో అమ్మడికి అంతగా ప్రాధాన్యతలేని రోల్స్ లో నటించే అవకాశాలు మాత్రమే వచ్చాయి.


5. సినిమాలు, వెబ్ సిరీసులు & షార్ట్ ఫిలిమ్స్
తెలుగులో స్టార్ స్టేటస్ దక్కకపోవడంతో ఇతర భాషల్లో ఫోకస్ పెట్టింది అదా. కన్నడ తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత హిందీలో 'కమాండో 2' 'కమాండో 3' 'చార్లీ చాప్లిన్ 2' 'బైపాస్ రోడ్' వంటి చిత్రాలతో మెప్పించింది. కొన్ని మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ లోనూ మెరిసింది. అలానే పలు హిందీ వెబ్ సిరీసుల్లో నటించిన ఈ భామ.. హీరో నాని నిర్మించిన 'మీట్ క్యూట్' సిరీస్ లోనూ భాగమైంది.


6. 'ది కేరళ స్టోరీ' వివాదంలో అదా
సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన 'కేరళ స్టోరీ' సినిమాలో ఆదా నటించింది. ఆమె షాలినీ ఉన్నికృష్ణన్ అనే హిందూ మహిళగా, పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాం మతంలోకి మారిన యువతిగా, బలవంతంగా ఉగ్రవాద సంస్థ ISISలో చేరిన అమ్మాయిగా కనిపించింది. విడుదలకు ముందు వివాదం చెలరేగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ మొదట సినిమాను చూసి, ఆ తర్వాత వారి అభిప్రాయాలను చెప్పాలని ట్విట్టర్ వేదికగా కోరింది. ఇప్పుడు రిలీజ్ తర్వాత ఆదా పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. 






7. అదా హాట్ ఫోటో షూట్స్
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆదాశర్మ.. ఎప్పటికప్పుడు తన సినిమా సంగతులతో పాటుగా వ్యక్తిగత విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో, వర్క్ అవుట్ వీడియోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నిమిషాల్లోనే నెట్టింట వైరల్ అవుతుంటాయి. 






8. అదా శర్మ రెమ్యునరేషన్
ఆదా ఒక్కో సినిమాకు రూ. 1 కోటి వరకూ పారితోషికం డిమాండ్ చేస్తుందని టాక్. 'ది కేరళ స్టోరీ' మూవీ కోసం అత్యధికంగా కోటి రూపాయలపైనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఆమెకు రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నారు.