వపర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరెక్కుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా రూపు దిద్దుకుంటోంది. షూటింగ్ ఎండింగ్ కు వచ్చింది. సుమారు 20 శాతం షూటింగ్ మిగిలి ఉంది. పవన్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో క్రిష్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కంప్లీట్ చేయడానికి సుమారు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.


‘ఓజీ’ షూటింగ్ లో పవన్ కల్యాణ్ బిజీ


ప్రస్తుతం పవన్ కల్యాణ్, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ ఇటీవలే ముంబైలో కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ పుణెలోని ప్రకృతి అందాల నడుమ షూటింగ్ కొనసాగుతోంది. సినిమాలోని పాటల చిత్రీకరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘ఓజీ’ తొలి షెడ్యూల్ కాగానే, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనాలి. కానీ, అనుకోకుండా ‘ఓజీ’ రెండో షెడ్యూల్ కు పవన్ ఓకే చెప్పడంతో షూటింగ్ కొనసాగుతోంది. అటు ఉస్తాద్ భగత్ సింగ్’ తదుపరి షెడ్యూల్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ సినిమా తరుపరి షెడ్యూల్ లొకేషన్స్ పరిశీలిస్తున్నారు.  ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డీఓపీ బోస్ తో హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు.  






ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంప్లీట్ అయ్యాకే ‘హరిహర వీరమల్లు’


నిజానికి ‘హరిహర వీరమల్లు’ సినిమాతో పోల్చితే  ఈ రెండు సినిమాలకి  కాల్ షీట్స్ చాలా తక్కువగా ఇస్తున్నారు. అందుకే, వేగంగా ఈ రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలోపడ్డారు. కొద్ది రోజుల పాటు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ని హోల్డ్ లో పెట్టారు పవన్ కల్యాణ్. అయితే, పవన్ ఓకే చెప్పగానే  ఫైనల్ షెడ్యూల్  ఏమాత్రం సమయం వృథా చేయకుండా కంప్లీట్ చేయాలని క్రిష్ భావిస్తున్నారట. అందుకోసం పకడ్బందీ ఫ్లాన్స్ వేసుకుంటున్నారట. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ సినిమాలు కంప్లీట్ అయితే పూర్తిస్థాయిలో ‘హరిహర వీరమల్లు’పై పవన్ ఫోకస్ పెట్టనున్నారు. నిజానికి ఈ చిత్రం పీరియాడికల్ జోనర్ లో రూపొందుతుందట. పవన్ ఇప్పటి వరకు చేయని క్యారెక్టరైజేషన్ కావడంతో కాస్త సమయం ఎక్కువ కేటాయించాల్సి వస్తోందట. ఈ కారణంగానే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోందట. ఇప్పటికే ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని క్రిష్ భావిస్తున్నారు. అనుకున్న సమయానికి విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా ఎన్నికలు సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ లోగానే సినిమాలన్నీ కంప్లీట్ చేసుకోవాలని భావిస్తున్నారు.  






Read Also: ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై సర్వత్రా నిరసనలు, థియేటర్ల దగ్గర భద్రత పెంచిన పోలీసులు