అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో సరికొత్త అధ్యాయం సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధృవం మీద విక్రమ్ ల్యాండర్ సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయ్యింది. దాని నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి పరిశోధన మొదలు పెట్టింది. ఏ దేశానికి సాధ్యం కాని ఫీట్ ను భారత్ సాధించింది. తొలిసారి దక్షిణ ధృవం మీద ల్యాండర్ ను దించి యావత్ ప్రపంచం చేత ప్రశంసలు పొందుతోంది. సుమారు 14 రోజుల పాటు ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై కీలక పరిశీలనలు చేయనుంది. అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? అనే విషయంలోనూ ఓ క్లారిటీ రానుంది.


చంద్రుడి మీద భూమి కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్స్ వీళ్లే!


చంద్రయాన్ 3 సక్సెస్ అయిన నేపథ్యంలో పలు సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమ్మీదే జరిగింది అనుకుంటాం. కానీ, చాలా మంది ధనవంతులు ఇప్పటికే చంద్రుడి మీద కూడా ప్లాట్లు కొనుగోలు చేశారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. చంద్రుడి మీద స్థలాలు కొనుగోలు చేసిన వారిలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ 52వ బర్త్ డే సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్లాట్లు కొనుగోలు చేసి కింగ్ ఖాన్ కు బహుమతిగా ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ వెల్లడించారు. చంద్రుడిపై కొనుగోలు చేసిన ఆ స్థలానికి షారుఖ్ ఖాన్ అనే పేరు పెట్టారట. అటు దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా చంద్రుడిపై ప్లాట్ కొనుగోలు చేశారు. ఆయనకు సైన్స్, అంతరిక్షంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. అందుకే చంద్రుడిపై తను కూడా భూమిని కొన్నారు. సుశాంత్ కొనుగోలు చేసిన ప్రాంతాన్ని  మేర్ ముస్కోవియన్స్ లేదంటే మస్కోవి సీ  అని పిలుస్తారు.   


ఇంతకీ చంద్రుడిపై భూమిని ఎలా కొనుగోలు చేస్తారు?


చంద్రుడిపై భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెబ్‌ సైట్‌ను సందర్శించి, భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి. చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు.


Read Also: ‘చంద్రయాన్-3’పై ఎలాన్ మస్క్ ట్వీట్ - ఆ హాలీవుడ్ మూవీ బడ్జెట్‌తో పోలికపై స్పందన


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial