బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఫలితంగా ఓపెనింగ్ డే భారీ కలెక్షన్స్ నమోదయ్యాయి. ట్రెండ్ చూస్తుంటే ఈ మూవీ ఈజీగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
'జవాన్' సినిమా హిందీతో పాటుగా తెలుగు తమిళ భాషల్లో అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ అయింది. ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అడ్వాన్స్ సేల్స్ లోనే అదరగొట్టింది. దీనికి కొనసాగింపుగా తొలి రోజు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ₹ 120 - ₹ 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే 'జవాన్' అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన బాలీవుడ్ మూవీగా నిలుస్తుంది. అంతేకాదు రెండు ₹100 కోట్ల ఓపెనింగ్ డే రికార్డ్‌లను కలిగి ఉన్న ఏకైక హిందీ నటుడిగా షారూఖ్ నిలుస్తాడు.
కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలో 'పఠాన్' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ గా 1050 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, 2023లో ఇప్పటి వరకు టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ జోష్ లో ఇప్పుడు సెకండాఫ్ లో 'జవాన్' మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ట్రెండ్ ని బట్టి చూస్తే, 1000 కోట్లకు పైగా వసూళ్లతో 'పఠాన్' సరసన చేరడమే కాదు, ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు.
Also Read: హాట్ అందాలు, ఎనర్జిటిక్ స్టెప్పులతో మెస్మరైజ్ చేసిన మిల్కీ బ్యూటీ!
ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల+ గ్రాస్ వసూలు చేసిన భారతీయ సినిమాలు 5 వున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'బాహుబలి 2'.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR.. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'దంగల్'.. యశ్ నటించిన KGF-2.. షారుక్ ఖాన్ 'పఠాన్' చిత్రాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'జవాన్' మూవీ కూడా ఈ జాబితాలో చేరుతుందో లేదో వేచి చూడాలి.
ఒకవేళ 'జవాన్' కూడా 1000 కోట్ల క్లబ్‌లో చేరితే మాత్రం షారుక్ ఖాన్ సరికొత్త రికార్డ్ సెట్ చేసినట్లు అవుతుంది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇంతవరకూ ఏ హీరో కూడా 2 వెయ్యి కోట్ల సినిమాలు అందుకోలేదు. అందులోనూ ఒకే ఏడాది బ్యాక్ టూ బ్యాక్ 1000+ కోట్ల గ్రాస్ సినిమాలు సాధించడం మామూలు విషయం కాదు. అదే జరిగితే ఈ ఘనత సాధించిన 'మొట్టమొదటి ఇండియన్ హీరో'గా కింగ్ ఖాన్ చరిత్ర సృష్టించిన వాడవుతాడు. మరి రానున్న రోజుల్లో బాక్సాఫీసు వద్ద ఏం జరుగుతుందో వేచి చూడాలి.
'జవాన్' చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై షారూక్ సరీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో నయన తార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకునే ప్రత్యేక పాత్రలో మెరిసింది.
Also Read: షారూఖ్ ఖాన్ మేనేజర్ పూజా సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial