బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం 'జవాన్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 7న విడుదలై బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే వారం రోజుల్లోనే రూ.700 కోట్లకు గ్రాస్ ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తర్వాత రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో షారుక్ 'డుంకి'(Dunki) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే 'జవాన్' సక్సెస్ తో షారుక్ తన రెమ్యూనరేషన్ ని అమాంతంగా పెంచినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది.


ఇప్పటికే 'జవాన్' సినిమా కోసం లాభాల్లో వాటాతో పాటు తన పాత్ర కోసం రూ.100 కోట్లు పారితోషకంగా తీసుకున్నారట షారుక్. అంతేకాకుండా తన నెక్స్ట్ మూవీ 'డుంకి' కోసం కూడా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం 'జవాన్' సక్సెస్ తో షారుక్ తన నెక్స్ట్ మూవీకి రూ.100 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ని తీసుకోబోతున్నాడని, అది ఎంత అనేది కరెక్ట్ గా తెలియకపోయినా రూ.100 నుంచి రూ.125 కోట్ల మధ్యలోనే షారుక్ రెమ్యూనరేషన్ ఉండబోతున్నట్లు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


అయితే షారుక్ రెమ్యూనరేషన్ కు సంబంధించి ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని షారుక్ ఖాన్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు మీడియాతో పంచుకున్నారు. "మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను, షారుక్ రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. ప్రపంచంలో ఏ ఒక్క యాక్టర్ కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకొని నెక్స్ట్ మూవీ నిర్మాణంలో ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ పెంచమని నిర్మాతల దగ్గరికి వెళ్ళడు. ఇక షారుక్ విషయాన్ని వస్తే ఆయన నటిస్తున్న 'డుంకి' మూవీ దాదాపు పూర్తయింది. 'జవాన్' సమయంలోనే 'డుంకి' మూవీ కి సైన్ చేశారు షారుక్. అలాంటప్పుడు అతను రెమ్యూనరేషన్ ఎక్కువ ఎలా అడుగుతాడు?" అంటూ షారుక్ ఫ్యామిలీ ఫ్రెండ్ బాలీవుడ్ మీడియాతో చెప్పుకొచ్చాడు.


అంతేకాకుండా.. "షారుక్ ఖాన్ అత్యాశకు వెళ్లే వ్యక్తి కాదని, ఆయన మూవీస్ ప్లాప్ అయిన తర్వాత కూడా రెమ్యూనరేషన్ ఎప్పుడూ తగ్గించుకోలేదు. సినిమా హిట్ అయినా కూడా పెంచలేదు. 'డుంకి' సినిమాకి సైన్ చేసినప్పుడు ఎంత రెమ్యునరేషన్ అనుకున్నారో అంతే రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడు, తప్పితే ఒక్క పైసా ఎక్కువ కాదు తక్కువ కాదు అని" అన్నాడు. కాగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ నటిస్తున్న 'డుంకి' మూవీ ని షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తోపాటు రాజ్ కుమార్ హిరానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో షారుక్ సరసన తాప్సీ ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Also Read : 'పుష్ప' మూవీని మూడు సార్లు చూశాను, నీ నుంచి చాలా నేర్చుకోవాలి - బన్నీపై షారుఖ్ ప్రశంసలు




Join Us on Telegram: https://t.me/abpdesamofficial