Mukesh Ambani About Shah Rukh Khan: అంబానీ ఇంట మూడురోజులు పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ మూడు రోజుల కోసం ఎందరో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు జామ్‌నగర్ చేరుకున్నారు. కానీ ఈ వేడుకలు ఇంకా అయిపోలేదని తెలుస్తోంది. మార్చి 6న మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చారు అంబానీ. దానికోసం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి సెలబ్రిటీలు మరోసారి జామ్‌నగర్ వెళ్లారు. మరోసారి ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఈవెంట్‌లో అనంత్ అంబానీకి షారుఖ్ ‘గాడ్‌ఫాదర్’ అని చెప్తూ షాకిచ్చారు ముకేశ్ అంబానీ.


స్పెషల్ ట్రీట్మెంట్..


కొన్నిరోజుల నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గురించే చర్చ నడుస్తోంది. దీనిపై ఎన్నో మీమ్స్, రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మార్చి 1 నుండి 3 వరకు జరిగి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుండి ఇప్పుడిప్పుడే నెటిజన్లు బయటికొస్తున్నారు. కానీ ఇది ముగిసిపోలేదు అన్నట్టుగా మార్చి 6న మరో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది అంబానీ కుటుంబం. మరోసారి ఈ ఈవెంట్ కోసం సెలబ్రిటీలు జామ్‌నగర్ చేరుకున్నారు. ఈసారి ఎక్కువమంది సెలబ్రిటీలు రాకపోయినా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ మాత్రం ఈ ఈవెంట్‌లో హైలెట్‌గా నిలిచారు. అంతే కాకుండా ఇందులో షారుఖ్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ కూడా దక్కింది. 


షారుఖ్ గ్రాండ్ ఎంట్రీ..


ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ఏర్పాటు చేసిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్‌ను స్టేజ్‌పైకి పిలవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్తానని ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఆ తర్వాత అనంత్ అంబానీకి షారుఖ్ గాడ్‌ఫాదర్‌ లాంటివాడని రివీల్ చేశారు. అప్పుడే షారుఖ్.. స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. కింద ఉన్న ఆడియన్స్ అంతా గ్రాండ్‌గా తనకు వెల్‌కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అనంత్ అంబానీకి షారుఖ్ గాడ్‌ఫాదర్ ఏంటి అని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు కూడా. ఎంతైనా అనంత్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో సెలబ్రిటీల అల్లరి చూస్తుంటే.. అంబానీ కుటుంబంతో వారికి ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి అర్థమవుతోంది. 


గుజరాతీలో డైలాగ్..


ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న షారుఖ్ ఖాన్.. గుజరాతీలో ఒక డైలాగ్ కూడా చెప్పి అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచారు. ఇలా అంబానీ ప్రతీ ఈవెంట్‌లో షారుఖ్ పాల్గొనడం చూసి నిజంగానే అనంత్‌కు తను గాడ్‌ఫాదర్ అని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో షారుఖ్, సల్మాన్, అమీర్ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేయడం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా అదే ఈవెంట్‌లో రామ్ చరణ్‌ను అవమానించాడనే వార్త కూడా దుమారం సృష్టించింది. అలా ఇప్పుడు ఎక్కడ చూసినా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గురించే కనిపిస్తోంది. 


Also Read: ఆ సీన్స్ చెయ్యడానికి రెడీ - ఫస్ట్ లిప్‌లాక్ అతడికే అంటున్న బజ్జీ పాప!