K Raghavendra Rao About Hanuman success : తేజా సజ్జ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'హనుమాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి12 న రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్కి, తేజ సజ్జ యాక్టింగ్కి ప్రతీ ఒక్కరూ మెస్మరైజ్ అయిపోతున్నారు. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో పాటూ డివోషనల్ కంటెంట్ కూడా ఉండడంతో థియేటర్స్ అంతా జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోతున్నాయి.ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుందీ సినిమా. ఇప్పటికే అన్ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కాంతార హీరో రిషబ్ శెట్టి సినిమాను స్వయంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తూ సినిమా సక్సెస్ పై హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఈ లిస్టులో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు కూడా చేరిపోయారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన హనుమాన్ సినిమా గురించి ట్వీట్ చేస్తూ.." సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్‌గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. దీంతో రాఘవేంద్ర రావ్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు హనుమాన్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు సరిపడా స్క్రీన్లు లభించడం లేదు. 'గుంటూరు కారం' సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించాయి. కానీ గుంటూరు కారం సినిమాకి ఆ స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదు.
అందరూ హనుమాన్ పైనే దృష్టి సారించడంతో ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇప్పుడు 'గుంటూరు కారం' తీసేసి కొన్ని థియేటర్లలో 'హనుమాన్' సినిమాని వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో మాత్రమే కాదు... ఓవర్సీస్ మార్కెట్ లోనూ 'హనుమాన్'కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా ఆడియన్స్ 'హనుమాన్' కి చూపిస్తున్న ఆదరణ అంతా అంతా కాదు. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా మూడు మిలియన్ డాలర్ల మార్క్ ని రీచ్ అయ్యి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో టాప్ 10 సినిమాల్లో ఆల్రెడీ 'హనుమాన్' చోటు సంపాదించింది. అక్కడ 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్రజెంట్ సినిమా జోరు చూస్తుంటే రూ. 200 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Also Read : హిందీ డబ్బింగ్ మూవీస్‌లో 'హనుమాన్' నయా రికార్డ్ - కుంభస్థలాన్ని బద్దలుకొడుతున్న తేజ సజ్జ