టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు కాదంబరి కిరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన సినీ కెరియర్ తో పాటు అక్కినేని నాగార్జున పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన తాను దర్శకుడిగా తీసిన సినిమాలు సక్సెస్ కాలేకపోయాయని దాంతో ఎలా బ్రతకాలో అర్థం కాలేదని అన్నారు. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.


" నేను ఈనాడులో ఉద్యోగం చేసే వాడిని. ఓ టీవీ సీరియల్ లో కనిపించడంతో నాకు ఓ మెమో ఇచ్చారు. ప్రతి కొత్త ఛానల్ లో నేను సీరియల్ ప్రొడ్యూస్ చేశాను. నేను ఓ వాచ్ మెన్, ఇండస్ట్రీలోని గుడ్, బ్యాడ్ అన్నీ నాకు తెలుసు. ఆ రోజు నేను ఒంటరి వాడిని. నాకు ఇష్టం లేదంటే స్పాట్లో ఇష్టం లేదని చెబుతాను. 'కుర్రాళ్ళ రాజ్యం' అనే సినిమా తర్వాత నాగార్జున గారికి ఓ కథ చెప్పాలని ఆయన ఇంటికి వెళ్లాను. నేను చెప్పే కథ వినడానికి నాగార్జున ఏకంగా రెండున్నర గంటలకు కూర్చున్నారంటే అది ఒక అద్భుతం. కానీ నేను చెప్పిన కథకు నాగర్జున రెండు సీన్లను కరెక్షన్ చేయమని తెలిపారు. 17 ఏళ్ళు గడిచినా ఆ రెండు సీన్ల కరెక్షన్ మాత్రం ఇప్పటికీ ఆయన వినడం లేదు. అది ఆయన తప్పు కాదు. ఆయన ఇంకా సినిమాల్లో హీరో గానే ఉన్నాడు. నేను ఇండస్ట్రీలోనే ఉన్నా. సో అది నా తలరాత, వదిలేసేయాలి అంతే" అని అన్నారు.


" సినిమా ఇండస్ట్రీలో డార్లింగ్ అనే పదాన్ని కనిపెట్టింది నేనే. ఆ డైలాగును పూరి జగన్నాథ్ బుజ్జిగాడు మూవీలో పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ కి అది ఊతపదంగా మారిపోయింది" అని అన్నారు. నాగార్జున గారితో మీరు తీయాల్సిన ''బావ'' మూవీ ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందని అడిగితే, అది నా ఫేట్ అంతే. ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయన క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. కొంతమందికి కొన్ని వర్కౌట్ అయితే కొంతమందికి వర్కౌట్ కావు" అని తెలిపారు.


" ఆ తర్వాత రమ్యకృష్ణ గారితో గజ్జల గుర్రం అనే సినిమా చేశా. అది వర్క్ అవుట్ అవ్వలేదు  తర్వాత సిమ్రాన్ గారితో ఓ సినిమా ప్లాన్ చేసాం. ఎలమంచిలి సాయిబాబా గారు నిర్మించారు. సినిమా కోసం ఆ రోజుల్లో ఆయన నాకు రూ.50 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. సిమ్రాన్ గారితో పాటు అందరూ కమెడియన్స్ కలిసి తీశాం. అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఉషా కిరణ్ మూవీస్ లో ఓ సినిమా అది అవ్వలేదు. బాబు మోహన్ గారి అబ్బాయి తో ఓ సినిమా అనుకున్నా అవ్వలేదు. ఇవన్నీ అవడం లేదని ఆగకుండా టెలివిజన్ ప్రొడక్షన్ చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ అక్కినేని నాగేశ్వరావు గారితో పరిచయం ఏర్పడింది" అని పేర్కొన్నారు .


" ఆయనతో రెండు సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను. అక్కడి నుంచి నాగేశ్వరావు గారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఓ సందర్భంలో నాగర్జున గారు ఏఎన్ఆర్ ని యాంకరింగ్ ఒప్పించాలని భాష తెలియకుండా చెప్పగా ఆయన పళ్ళు రాలగొడతారని అన్నాను. నాగార్జునకి పల్లెటూరి టైటిల్స్ ఉంటే చాలా ఇష్టం. ఇండస్ట్రీలో ఆయన్ని చిన్నబాబు అని పిలుస్తారు" అంటూ చెప్పుకొచ్చారు కాదంబరి కిరణ్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతాయి.


Also Read : బాలీవుడ్ లో భంగపాటు - పాన్ ఇండియా స్టార్స్ అవుదామని బోల్తాపడ్డ టాలీవుడ్ హీరోలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial