సుమన్ తేజ్ (Suman Tej) కథానాయకుడిగా నటించిన సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. ఈ చిత్రాన్ని డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ప్రొడ్యూస్ చేశారు. సతీష్ పరమవేద దర్శకత్వం వహించారు. సుమన్ తేజ్ సరసన గరీమా చౌహన్ (Garima Chauhan) కథానాయికగా నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఏప్రిల్ 26న 'సీతా కళ్యాణ వైభోగమే'
Sita Kalyana Vaibhogame Movie Release Date: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26వ తేదీన 'సీతా కళ్యాణ వైభోగమే'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని నిర్మాత రాచాల యుగంధర్ చెప్పారు. ''ఇదొక ఫీల్ గుడ్ సినిమా. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలతో పాటు మంచి ప్రేమ కథ కూడా ఉంది'' అని ఆయన తెలిపారు.
Also Read: ఎన్టీఆర్ 'దేవర'కు బాలీవుడ్‌లో భారీ డిమాండ్... రెండు అగ్ర నిర్మాణ సంస్థలు కలిసి!
గోవాలో 250 మందితో పాట... భారీ యాక్షన్ ఎపిసోడ్స్
Sita Kalyana Vaibhogame Movie: 'సీతా కళ్యాణ వైభోగమే' విడుదల తేదీ వెల్లడిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో హీరోయిన్ సుమన్ తేజ్, గరీమా చౌహన్ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ లుక్ సైతం మంచి స్పందన అందుకుందని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
'సీతా కళ్యాణ వైభోగమే' విడుదల తేదీ వెల్లడించిన సందర్భంగా సినిమా గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''ప్రేమ, కుటుంబ అనుబంధాలు, యాక్షన్... అన్నీ మేళవించి తీసిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్', 'భగవంత్ కేసరి' సహా పలు సినిమాల్లో హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్ నేతృత్వంలో గోవాలో సుమారు 250 మంది డ్యాన్సర్లతో ఓ పాట తీశాం. సినిమాలో ఆ సాంగ్ ఒక హైలైట్ అవుతుంది. వంద మంది ఫైటర్లతో భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఒకటి తీశాం. అదీ అందరినీ ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.
Also Read: శర్వానంద్ 38వ సినిమా ఫిక్స్ - డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్!?
'సీతా కళ్యాణ వైభోగమే'లో సుమన్ తేజ్, గరీమా చౌహన్ జంటగా నటించారు. గగన్ విహారి విలన్ రోల్ చేశారు. ఇంకా ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, ఛాయాగ్రహణం: పరుశురామ్, కూర్పు: డి. వెంకట ప్రభు, పోరాటాలు: డ్రాగన్ ప్రకాష్, నృత్య దర్శకత్వం: భాను మాస్టర్ - పోలకి విజయ్, నిర్మాణం: రాచాల యుగంధర్, దర్శకత్వం: సతీష్ పరమవేద.