Super Hero Hanu Man Song:  సూపర్ హీరోల సినిమాలను ఇష్టపడే భారతీయ సినీ అభిమానుల కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘హనుమాన్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నారు. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో 'హను మాన్' సాహసాలను మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. యూనిక్ కాన్సెప్ట్స్ తో ఒరిజినల్ సినిమాలు తీయడమే కాకుండా, ప్రమోషన్స్‌ లోనూ తనదైన ముద్రను వేసుకుంటున్నారు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, హనుమాన్ చాలీసా పాటకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై మరింత ఆసక్తి కలిగేలా దర్శకుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  


చిల్డ్రన్స్ డే కానుకగా సూపర్ హీరో ఆంథమ్‌ విడుదల


ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ‘సూపర్‌ హీరో హనుమాన్‌’ ను విడుదల చేసేందుకు దర్శకుడు  చిల్డ్రన్స్ డేను ఎందుకు ఎంచుకున్నారు? అని చాలా మంది  ఆశ్చర్యపోయారు. కానీ, ఈ పాట విడుదలయ్యాక అందరికీ క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.  సూపర్‌ హీరో హనుమాన్ పాట ఫన్నీగా, అడ్వెంచరస్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పిల్లలకు ఇంకా బాగా నచ్చింది.  ఈ పాట కోసం అనుదీప్ దేవ్ పెక్యులర్ నెంబర్ ని కంపోజ్ చేశారు. వాగ్దేవి, ప్రకృతి, మయూఖ్ హ్యూమరస్ గా అలపించారు. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం కంప్లీట్ కామికల్ గా ఆకట్టుకుంది. ఒరిజినల్ విజువల్స్‌ తో కామికల్ నెరేషన్ పిల్లలను ఆకట్టుకుంటోంది. నిజానికి, పిల్లలు సూపర్ హీరో హనుమాన్ సూపర్ పవర్‌లను చూడటానికి ఇష్టపడతారు. ఈ సూపర్ ఆంథమ్‌ ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల కోసం బెస్ట్ ప్రజంటేషన్ గా అలరిస్తోంది. 



జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల


ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా హను మాన్. ఈ మూవీ సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. హనుమాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.


ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీనాగేంద్ర తంగాల వ్యవహరిస్తున్నారు.


Read Also: రాకింగ్‌ రాకేష్‌‌కు షాకిచ్చిన ఎలక్షన్ కమిషన్, ‘కేసీఆర్’ సినిమా రిలీజ్‌పై కీలక నిర్ణయం