Pawan Kalyan - Harish Shankar : ఏ పాన్ ఇండియా బజ్ సరిపోదు... పవన్, హరీష్ శంకర్ మూవీపై బిగ్ లీక్ ఇచ్చిన ప్రొడ్యూసర్
Pawan Kalyan - Harish Shankar : పవన్ కళ్యాణ్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత రవిశంకర్. పవన్, హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాపై 'రాబిన్ హుడ్' ప్రమోషన్లలో అప్డేట్ ఇచ్చారు.

Pawan Kalyan Harish Shankar Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా తెరకెక్కాల్సి ఉంది. పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అసలు ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది ? అనేది ఇంకా కన్ఫ్యూజన్‌గానే ఉంది. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ 'రాబిన్ హుడ్' మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ సినిమా ముందు ఏ బజ్ సరిపోదు
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న హీస్ట్ ఎంటర్టైనర్ 'రాబిన్ హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నిర్మాత రవిశంకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో హరిష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ అప్డేట్ కూడా ఇచ్చారు.
రవి శంకర్ మాట్లాడుతూ "నెక్స్ట్ ఇయర్ మా ఆరవ సినిమాగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబోతోంది. పవన్ సినిమా అంటే ఏ పాన్ ఇండియా బజ్ కూడా సరిపోదు. హరిష్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు. కథ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీ షూటింగ్ ఈ ఏడాది అయిపోగొట్టి, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తాము. కాబట్టి 2025 మైత్రికి ఓ ప్రెస్టీజియస్ ఇయర్ కాబోతోంది. ఈ మూవీతో మేము నెక్స్ట్ లెవెల్లో ఒక కొత్త అచీవ్మెంట్ అందుకోబోతున్నాం" అంటూ ఈ మూవీపై మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు.
'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే
ఏపీలో డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చేతిలో 'హరిహర వీరమల్లు'తో పాటు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఓజీ' మూవీ ఉన్నాయి. 'హరిహర వీరమల్లు' షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మే 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే పవన్ 'ఓజీ' షూటింగ్ కూడా పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీని పట్టాలెక్కించబోతున్నారు. ఇక ఇప్పటికే హరీష్ లీక్స్ అంటూ హరీష్ శంకర్ ఓ మూవీ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రచారంలో సంచలనం సృష్టించిన ఓ సీన్‌ను ఈ మూవీలో రీక్రియేట్ చేయబోతున్నాం అని ప్రకటించి, ఉత్సాహాన్ని పెంచారు.