హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను 'సత్యం' రాజేష్ (Satyam Rajesh) నవ్వించారు. నటుడిగానూ మెరిశారు. హీరో హీరోయిన్లకు స్నేహితుడిగా పలు చిత్రాల్లో కనిపించారు. ఆయనలో హాస్య నటుడు మాత్రమే కాదు... హీరో కూడా ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... 'మా ఊరి పొలిమేర' సినిమా. అది ఓటీటీలో విడుదల అయినప్పటికీ... ఆ సినిమా ద్వారా ప్రేక్షకులను భయపెట్టారు 'సత్యం' రాజేష్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'మా ఊరి పొలిమేర 2' (Maa Oori Polimera 2 Movie)తో నవంబర్ 3న థియేటర్లలోకి వస్తున్నారు. అది కాకుండా హీరోగా మరో సినిమా కూడా చేస్తున్నారు ఆయన. 


'సత్యం' రాజేష్ హీరోగా 'టెనెంట్'
Satyam Rajesh New Movie : 'సత్యం' రాజేష్ హీరోగా మహా తేజ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'టెనెంట్' (Tenant Movie). దీనికి వై. యుగంధర్ దర్శకుడు. ఇంతకు ముందు 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మాత. ఆయన దీని కంటే ముందు 'అద్భుతం' చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. 


'టెనెంట్' కథ ఏమిటి?
Tenant Movie Glimpse Released : ఎమోషనల్ మర్డర్ మిస్టరీగా 'టెనెంట్' సినిమాను తెరకెక్కించినట్లు దర్శక, నిర్మాతలు చెప్పారు. సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనలకు ఈ చిత్ర కథాంశం చాలా దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు  ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని కోరారు. 


Also Read నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు


'సత్యం' రాజేష్ జోడీగా మేఘా చౌదరి నటించిన చిత్రమిది. 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'వర్మ'తో పాటు తెలుగులో నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ నటించిన 'ఊరంతా అనుకుంటున్నారు', 'మార్షల్' సినిమాల్లో ఆమె నటించారు. ఈ సినిమాతో తెలుగులో బిజీ కావాలని ఆమె కోరుకుంటున్నారు. 'పొలిమేర 2' తర్వాత 'సత్యం' రాజేష్ నుంచి వచ్చే సినిమా కాబట్టి మంచి అంచనాలు ఉంటాయని చెప్పవచ్చు.


Also Read లింగోచ్చా రివ్యూ : హైదరాబాద్ నేపథ్యంలో హిందూ ముస్లిం ప్రేమకథ - కార్తీక్ రత్నం సినిమా ఎలా ఉందంటే?



సత్యం రాజేష్, మేఘా చౌదరి (Megha Chowdhury) జంటగా నటిస్తున్న 'టెనెంట్' సినిమాలో చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, 'ఆడుకాలం' నరేన్, ఎస్తేర్ నొరోన్హా, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేఘ్న తదితరులు ఇతర తారాగణం.


ఈ చిత్రానికి కూర్పు : విజయ్ ముక్తవరపు, కళా దర్శకత్వం : కరకరాల చంద్రమౌళి, 8పీఎం సాయి, స్టంట్స్ : రాబిన్ సుబ్బు, ఛాయాగ్రహణం : జెమిన్ జోం అయ్యనీత్, క్రియేటివ్ నిర్మాత : ప్రసూన మండవ, కథ: వై.ఎస్.శ్రీనివాస వర్మ, సాహిత్యం, సంగీతం : సాహిత్య సాగర్, సహ నిర్మాత : రవీందర్ రెడ్డి ఎన్, నిర్మాత : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం : వై. యుగంధర్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial