తెలుగు తెర చందమామ, అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సత్యభామ'. ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రమిది. పెళ్లి తర్వాత కాజల్ ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించిన సినిమా కూడా ఇదేనని చెప్పవచ్చు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా 'భగవంత్ కేసరి'లో ఆమె కనిపించరు. అయితే... ఆ పాత్ర నిడివి తక్కువ. వెండితెరపై కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)ను పూర్తి స్థాయి పాత్రలో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అది 'సత్యభామ'తో నెరవేరుతుందని చెప్పవచ్చు. 


దీపావళికి 'సత్యభామ' టీజర్!
'సత్యభామ' సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఇంతకు ముందు విజయ్ 'జిల్లా' సినిమాలో ఆమె పోలీస్ రోల్ చేశారు. అయితే... అందులో హీరోతో పాటు రొమాంటిక్ సీన్లు, పాటలకు ఆమె పాత్ర పరిమితం అయ్యింది. ఫస్ట్ టైమ్ కాజల్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నది 'సత్యభామ' సినిమాలో అని చెప్పవచ్చు. ఈ దీపావళికి... నవంబర్ 10న 'సత్యభామ' టీజర్ విడుదల చేస్తున్నారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. 


Also Read : బ్లడ్ బాత్‌కి బ్రాండ్ నేమ్ - బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ షురూ






నిర్మాతగా మారిన 'మేజర్' & 'గూఢచారి' దర్శకుడు
'సత్యభామ' సినిమాతో దర్శకుడు శశికిరణ్ తిక్క చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టారు. అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్', 'గూఢచారి' సినిమాలతో ఆయన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. విజయాలు అందుకున్నారు. 'సత్యభామ'కు ఆయన చిత్ర సమర్పకులు. అంతే కాదు... స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. 


వచ్చే వేసవికి థియేటర్లలోకి 'సత్యభామ' 
'దీపావళి'కి 'సత్యభామ' టీజర్ విడుదల కానున్న సందర్భంగా నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ ''సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆల్రెడీ 60 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేశాం. హైదరాబాద్ సిటీలో కాజల్ అగర్వాల్, ఇతర తారాగణం మీద కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాం. ఈ నెల రెండో వారంలో కొత్త షెడ్యూల్ మొదలు పెడతాం. వచ్చే వేసవికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అని అన్నారు. 


Also Read : 'దమ్ మసాలా' ఒరిజినల్ సాంగ్ కాదా? హిందీ పాటను తమన్ ఎత్తేశాడా?
 
కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ : అవురమ్ ఆర్ట్స్, కథనం & చిత్ర సమర్పణ : శశి కిరణ్ తిక్క, నిర్మాతలు : బాబీ తిక్క - శ్రీనివాసరావు తక్కలపెల్లి, సహ నిర్మాత : బాలాజీ, ఛాయాగ్రహణం : జి విష్ణు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: సుమన్ చిక్కాల.