సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఇది గుడ్ న్యూస్. అలాగే, 'సర్కారు వారి పాట' సినిమాను ఓటీటీలో చూడాలని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు కూడా! అది ఏంటంటే... జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ స‌బ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారు ఫ్రీగా చూడవచ్చు. ఆ రోజు నుంచి ప్రైమ్‌లో సినిమా ఫ్రీ అన్నమాట.
 
నిజం చెప్పాలంటే... అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో జూన్ 2న 'సర్కారు వారి పాట' విడుదలైంది. అయితే... అప్పుడు స‌బ్‌స్క్రైబ‌ర్స్‌కు ఫ్రీగా చూసే అవకాశం కల్పించలేదు. ఓటీటీ స‌బ్‌స్క్రిప్షన్‌ ఉన్నాసరే... 199 రూపాయలు కడితేనే చూసే అవకాశం కల్పించింది. ఇప్పుడు ఫ్రీ అన్నమాట.


'సర్కారు వారి పాట' థియేటర్లలో విడుదలైనప్పుడు 'మురారి' పాట లేదు. ఈ నెల ప్రారంభంలో యాడ్ చేశారు. అదీ సినిమా చివర్లో టైటిల్స్ పడేటప్పుడు! ఇప్పుడు ఆ సాంగ్ కోసం ఓటీటీలో సినిమా చూసే అభిమానుల సంఖ్య ఎక్కువ ఉండవచ్చు.


Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట


మే 12న 'సర్కారు వారి పాట' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు.


Also Read: విజయ దశమికి థియేటర్లలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ? ఆ రెండు సినిమాల మధ్య పోటీ?