'విక్రమ్' విజయంతో లోక నాయకుడు కమల్ హాసన్ మళ్ళీ రేసులోకి వచ్చారు. సరైన కథ, క్యారెక్టర్ పడితే... 300 కోట్ల రూపాయలు వసూలు చేయగల సినిమా చేయడం ఆయనకు అసాధ్యం కాదని లోకేష్ కనకరాజ్ ప్రూవ్ చేశాడు. కమల్ సినిమాలు కొన్ని సంవత్సరాలుగా పేరు సంపాదిస్తున్నాయి. కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి. అయితే, 'విక్రమ్' స్థాయిలో వసూలు చేసిన సినిమా లేదని చెప్పాలి. ఈ సినిమా వసూళ్లతో కమల్ ఏం చేశారు? పలువురి మదిలో మెదిలిన ప్రశ్న ఇది.
గత కొన్నేళ్లుగా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కమల్ హాసన్ సరైన విజయాలు అందుకోలేదు. అందువల్ల, 'విక్రమ్' వసూళ్లతో అప్పులు తీరుస్తున్నారని చెన్నై సినిమా వర్గాల టాక్. ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలోనూ ఆయన మాటలు ఆ విధంగానే ఉన్నాయి.
''నా కెరీర్స్‌లో సినిమా ఒకటి. సినిమాల్లో నటించడం కొనసాగిస్తా. నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. నేను సినిమాలు చేయడానికి మీరు అనుమతి ఇస్తే... మూడు వందల కోట్లు సంపాదిస్తా. నా అప్పులు అన్నీ తీరుస్తా. కడుపు నిండా తింటా. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చేతనైనంత సాయం చేస్తా'' అని కమల్ హాసన్ అన్నారు.
Also Read: డిజిటల్ తెరపై రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ పెళ్ళంట
'విక్రమ్' విజయం తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్, సహాయ దర్శకులు పదమూడు మందితో పాటు అతిథి పాత్రలో నటించిన సూర్యకు ఖరీదైన బహుమతులు ఇచ్చిన కమల్ హాసన్... ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తో సమావేశం అయ్యారు.
Also Read: హీరోయిన్ అంజలి 'బహిష్కరణ'