Sarkaru Vaari Paata Box Office: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. గురువారం విడుదల అయ్యింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించినా... ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తోంది.  


Sarkaru Vaari Paata Movie Box Office collection Day 1 in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 'సర్కారు వారి పాట' సినిమా మొదటి రోజు రూ. 36.63 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. ఇది షేర్, గ్రాస్ వసూళ్లు కాదు. ఒక్క నైజాంలో మొదటిరోజు రూ. 12.24 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. 'ఆర్ఆర్ఆర్'ను మినహాయిస్తే...  ఇప్పుడు నైజాంలో హయ్యస్ట్ కలెక్షన్స్ 'సర్కారు వారి పాట'దే. ఈ సినిమా నాన్ - 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ఏరియాల్లో రికార్డు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!


మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్ కథానాయిక. పరశురామ్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. సినిమాకు వస్తున్న స్పందన పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. 


Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?