Saripodhaa Sanivaaram: జపాన్‌లో రిలీజ్‌కు 'సరిపోదా శనివారం' రెడీ... ఇప్పటి వరకు అక్కడ విడుదలైన సినిమాలెన్నో తెలుసా?
Saripodhaa Sanivaaram : నాని పాన్ వరల్డ్ హీరోగా మొదటి అడుగు వేయబోతున్నారు. ఆయన నటించిన 'సరిపోదా శనివారం' మూవీ జపాన్ లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రీచ్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలకు విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉండడంతో, అక్కడ కూడా వీళ్ళు నటించిన సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలను రిలీజ్ చేసే ట్రెండ్ రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే బాహుబలి, పుష్ప, కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను రష్యా, జపాన్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే మరో టాలీవుడ్ హీరో నాని తన సినిమాను జపాన్లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.
జపాన్ లో 'సరిపోదా శనివారం'...
నేచునల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో 100 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కౌంట్ ను డబుల్ చేసిన మూవీనే 'సరిపోదా శనివారం'. నాని, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు 'సూర్య సాటర్డే' పేరుతో ఫిబ్రవరి 14న జపాన్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. నాని సినిమా ఇలా జపాన్లో రిలీజ్ కావడం అన్నది ఇదే మొదటిసారి. ఇప్పటికే మూవీని రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ మూవీని జపాన్ ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే
'కల్కి 2898 ఏడీ'కి తప్పని నిరాశ
విదేశాల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న హీరోల్లో ప్రభాస్, తారక్ ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ప్రభాస్ కి అయితే డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తమ దేశాలలో డార్లింగ్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం నుంచి, హైదరాబాద్ కు వచ్చి మరీ బర్త్ డే విషెస్ చెప్పే రేంజ్ లో ప్రభాస్ విదేశీ అభిమానగణం ఉంది. అయినప్పటికీ రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీకి పెద్దగా ఆదరణ దక్కలేదు. స్వయంగా చిత్రబృందం మొత్తం వెళ్ళి జపాన్ లో ప్రమోషన్స్ చేసినప్పటికీ, ఓపెనింగ్ తప్ప లాంగ్ రన్ విషయంలో ఫలితం లేకుండా పోయింది.
జపాన్ లో రిలీజ్ అయిన సినిమాలు
అంతకుముందు జపాన్ లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అంతకంటే ముందు బాద్ షా, మగధీర, సాహో, రోబో, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ముత్తు, దంగల్, 3 ఇడియట్స్, ఇంగ్లీష్ ఇంగ్లీష్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు జపాన్లో బాగా ఆడాయి. ఇక ఇప్పుడు 'సరిపోదా శనివారం' అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.