Auto Ram Prasad: హీరోగా 'ఆటో' రాంప్రసాద్... 'అల్లరి' నరేష్ అభినందన - సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

Wife Of Anirvesh: పాపులర్ కామెడీ టీవీ రియాలిటీ షో 'జబర్దస్త్' నటులు ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'ఆటో' రాంప్రసాద్ సోలో హీరోగా ఆయన చేస్తున్నారు.

Continues below advertisement

తెలుగు బుల్లితెర చరిత్రలో 'జబర్దస్త్' సెన్సేషన్. ఆ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్లు కొందరు హీరోలుగా వెండితెరకు వచ్చారు. సోలో హీరోగా 'సుడిగాలి' సుధీర్ భారీ విజయం అందుకున్న సందర్భం ఉంది. ఆయనతో పాటు 'జబర్దస్త్' షోలో స్కిట్స్ చేసిన 'ఆటో' రాంప్రసాద్ (Auto RamPrasad), 'గెటప్' శ్రీను పలు సినిమాల్లో కామెడీ రోల్స్, డిఫరెంట్ రోల్స్ చేశారు. ఈ ముగ్గురూ కలిసి 'త్రీ మంకీస్' అని ఒక సినిమా చేశారు. ఇప్పుడు 'ఆటో' రాంప్రసాద్ (Jabardast Ramprasad) సోలో హీరోగా సినిమా చేస్తున్నారు.

Continues below advertisement

'ఆటో' రాంప్రసాద్ హీరోగా 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్'
Jabardasth Ramprasad turns main lead with Wife Of Anirvesh: 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్' సినిమాతో 'ఆటో' రాంప్రసాద్ హీరోగా మారుతున్నారు. ఇందులో 'జెమినీ' సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి ఇతర ప్రధాన తారాగణం.

'వైఫ్ ఆఫ్ అనిర్వేష్' సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తున్నారు. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర ప్రొడ్యూస్ చేస్తున్నారు.

'వైఫ్ ఆఫ్ అనిర్వేష్'కు అల్లరి నరేశ్ అభినందన
క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమా 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్'. ఇందులో కొన్ని సన్నివేశాలను ఇటీవల 'అల్లరి' నరేష్ (Allari Naresh) చూశారు. ఆ తర్వాత దర్శకుడు గంగ సప్తశిఖరను ప్రత్యేకంగా చాలా ప్రశంసించారు. కొత్త తరహా స్క్రీన్ ప్లేతో 'వైఫ్ ఆఫ్ అనిర్వేష్' తెరకెక్కిందని ఆయన చెప్పారట. సీనియర్ రైటర్ బాబీ కెఎస్ఆర్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.

Also Read: పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో 100 కోట్ల నష్టం... శింగనమల రమేష్‌ బాబుదే తప్పు - నిర్మాత బండ్ల గణేష్ వైరల్ ట్వీట్


'వైఫ్ ఆఫ్ అనిర్వేష్' చూసిన తర్వాత దర్శక నిర్మాతలను అభినందించిన 'అల్లరి' నరేష్ మాట్లాడుతూ... ''ఒక కొత్త రకమైన కథతో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఎంగేజింగ్‌గా తీశారు. ప్రేక్షకులకు అతి త్వరలో ఈ సినిమా చూపించబోతున్నామని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సంగీత దర్శకుడు షణ్ముఖ స్వరాలు, నేపథ్య సంగీతం కథకు ప్రాణం పోసింది. వీఆర్కే నాయుడు కెమెరా వర్క్ కూడా బావుంది. అందరి నుంచి దర్శకుడు గంగ సప్తశిఖర మంచి అవుట్ పుట్ తీసుకున్నారు'' అని అన్నారు. ఎస్.కె.ఎం.ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

Also Readఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే

Continues below advertisement