Venkatesh Sankranthiki Vasthunam Box Office Collection Worldwide: విక్టరీ వెంకటేష్ విజయ యాత్ర... అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి లభించిన జైత్ర యాత్ర... సంక్రాంతి బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా వసూళ్ల యాత్ర...‌‌ రెండో రోజు జోరుగా హుషారుగా కొనసాగింది. రెండు రోజుల్లో ఈ సినిమా భారీ కలెక్షన్లు నమోదు చేసింది. 


రెండు రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు ఎంత అంటే?
సినిమా విడుదలైన రోజు జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు కూడా ఆ జోరు కనపడింది. జనవరి 15న ఈ సినిమా 32 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రెండు రోజుల్లో మొత్తం మీద 77 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనౌన్స్ చేసింది. 






ఇవాళ్టితో 100 కోట్ల క్లబ్బులోకి 'సంక్రాంతికి వస్తున్నాం'...‌‌ వెంకీ మాస్!
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయనుంది. ఇవాళ సినిమా 100 కోట్ల క్లబ్బులో చేరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మూడో రోజు కూడా బాక్సాఫీస్ బరిలో సినిమా జోరు కొనసాగుతోంది. మరోవైపు అమెరికా నుంచి కూడా సినిమాకు భారీ స్పందన లభిస్తుంది. వన్ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరింది.


Also Readటీడీపీ, జనసేనకు బుల్లి రాజు ప్రచారం... ఏపీ ఎన్నికల్లో వెంకీ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల ఏం చేశాడో చూశారా?






విక్టరీ వెంకటేష్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్న రికార్డ్ క్రియేట్ చేసింది. అది ఒక్కటే కాదు... ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే దిశగా ముందుకు వెళుతోంది. వెంకటేష్ కెరీర్ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా 'సంక్రాంతికి వస్తున్నాం' నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.


Also Read: తెలుగులోకి 1000 కోట్లు కొల్లగొట్టిన చైనీస్ యాక్షన్ మూవీ... 'హాంగ్ కాంగ్ వారియర్స్' ట్రైలర్ వచ్చేసింది, థియేటర్లలో రిలీజ్ ఎప్పుడంటే?



వెంకటేష్ భార్యగా భాగ్యలక్ష్మి పాత్రలో ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసి మీనాక్షి పాత్రలో మీనాక్షి చౌదరి నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో తెలంగాణ ముఖ్యమంత్రిగా సీనియర్ నరేష్ కనిపించారు. వెంకటేష్ కుమారుడిగా పవన్ సాయి రేవంత్ సుభాష్ భీమల‌ తన నటనతో అదరగొట్టారు. పమ్మీ సాయి, ఉపేంద్ర లిమయే, డైలాగ్ కింగ్ సాయి కుమార్, మురళీధర్ తదితరులు నటించిన ఈ సినిమాను అక్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేశారు ఈ చిత్రానికి బీమ్స్ సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతం విజయంలో కీలక పాత్ర పోషించాయి.