Varun Sandesh Nindha Movie Updates: వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'నింద'. ఈ చిత్రానికి 'ఏ కాండ్రకోట మిస్టరీ' అనేది ఉప శీర్షిక. దీని ప్రత్యేకత ఏమిటి? అంటే... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీలోని కాండ్రకోట మిస్టరీ స్ఫూర్తి, ఆధారంగా రూపొందిన చిత్రమిది. రాజేష్ జగన్నాథం 'నింద' చిత్రానికి దర్శక నిర్మాత. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కించారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమాలో 'సంకెళ్లు వీడే...' పాటను గానామాస్ స్పెషల్ పాఠశాలకు చెందిన పిల్లల చేత విడుదల చేయించారు. 


''కమ్ముతున్న చిమ్మ చీకట్లో... చీకట్లో!
అంతు చూడమన్న ప్రశ్నల్లో... ప్రశ్నల్లో!
ఏ అర్థం ఉందో? అన్వేషించు
ఏ యుద్ధం ఉందో? సిద్ధం రా అంటూ
పోరాటం చేయాలంటున్న సందేశాల జోరే!
ఇక ఆకాశం జారి చేతుల్లోన వాలే వేగం చూపే...
సంకెళ్లు వీడే... సందేహం పోయే... సంఘర్షణ తీరదా!''
అంటూ 'నింద' సినిమాలో 'సంకెళ్లు వీడే...' పాట సాగింది. కిట్టూ విస్సాప్రగడ దీనికి సాహిత్యం అందించగా... ప్రముఖ గాయకుడు శ్రీరామ చంద్ర ఆలపించారు. సంతు ఓంకార్ సంగీతం అందించారు. కథలో కీలక సందర్భంలో వచ్చే ఈ పాటలో పలు అంశాలు అంతర్లీనంగా చెప్పినట్టు సమాచారం.


Also Read: బెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై విష్ణు మంచు ట్వీట్... నటి హేమపై అప్పుడు చర్యలు తీసుకుంటామని వెల్లడి



'బలి కోరిన చీకటిలోన... తొలి వేకువ యుద్ధం రా! నిను వీడని నీడకు కూడా... పలు రంగులు పూయాలా' అంటూ సినిమాపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు.


Also Read: రెండు వారాలు వెనక్కి వెళ్లిన అజయ్ ఘోష్ సినిమా - 'మ్యూజిక్ షాప్ మూర్తి' విడుదల ఎప్పుడంటే?



కొన్నాళ్ల క్రితం విడుదల చేసిన 'నింద' టీజర్... 'జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు' అని తనికెళ్ల భరణి మాటతో మొదలైంది. ఆ ఊరిలోని బాలరాజు తోటలో ఒక వ్యక్తి చూసిన శవం ఎవరిది? ఆ ఊరిలో ప్రేమకథలు ఏమిటి? హీరో ఏం చేశాడు? అనేది సినిమాలో చూడాలి. క్రైమ్, సస్పెన్స్ నేపథ్యంలో తీసిన థ్రిల్లర్ చిత్రమిది. ఆల్రెడీ విడుదల చేసిన మూవీ గ్లింప్స్, టైటిల్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయని... ప్రేక్షకులకు ఉత్కంఠతో పాటు మంచి అనుభూతి ఇచ్చే సినిమా 'నింద' అని చిత్ర దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం చెప్పారు.


Nindha Movie Cast And Crew: 'నింద'లో శ్రేయా రాణి, ఆనీ, క్యూ మధు కథానాయికలుగా నటించారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, 'ఛత్రపతి' శేఖర్, 'మైమ్' మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, శ్రీరామ సిద్ధార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ ఇతర కీలక తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు, కూర్పు: అనిల్ కుమార్, కెమెరా: రమీజ్ నవీత్, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, సంగీత దర్శకత్వం: సంతు ఓంకార్, నిర్మాణ సంస్థ: ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్, రచన-నిర్మాణం-దర్శకత్వం: రాజేష్ జగన్నాథం.