'కెజియఫ్' సినిమాతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt)కు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొత్త ఇమేజ్ వచ్చింది. కన్నడ పరిశ్రమ మరో కొత్త విలన్ దొరికాడని సంబరపడింది. కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన సమయంలోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఖల్ నాయక్ నటించారు. అయితే, 'కెజియఫ్'లో అధీరా పాత్ర స్టైల్ సపరేట్.
'కెజియఫ్'లో అధీరా పాత్ర విలనిజాన్ని, క్రూరత్వాన్ని కొత్త కోణంలో చూపించింది. ఆ పాత్ర తర్వాత కన్నడ నుంచి సంజూ బాబాకు చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే, ఆయన ఆచితూచి క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా (Dhruva Sarja) హీరోగా రూపొందుతోన్న 'కేడీ'లో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగులో ఆయన గాయపడినట్లు తెలిసింది.
బాంబు సీక్వెన్స్ తీస్తుండగా...
ప్రస్తుతం 'కేడీ' సినిమా చిత్రీకరణ బెంగళూరులో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ రవి వర్మ నేతృత్వంలో ఓ భారీ బాంబు పేలుడు సన్నివేశం తీస్తున్నారు. అప్పుడు సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం అందింది. ముఖానికి, చేతికి, భుజానికి గాయాలు అయ్యాయట. దాంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేసి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, సంజయ్ దత్ అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని కన్నడ చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
రక్షిత భర్త దర్శకత్వంలో...
'కేడీ' సినిమాకు ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఎవరో కాదు... తెలుగులో పలు సినిమాల్లో కథానాయికగా నటించిన 'ఇడియట్' ఫేమ్ రక్షిత భర్త. సినిమా అనౌన్స్ చేసినప్పుడు టీజర్ కూడా విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా టీజర్ ను కట్ చేశారు. 'రామాయణ యుద్ధం స్త్రీ కోసం.. మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తరువాత కాళీ అనే వ్యక్తి రిలీజ్ అవుతున్నాడని.. పోలీసులు సిటీ మొత్తాన్ని అలెర్ట్ చేయడం, సిటీ లోపలకి అతడు రాకుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకోవడం వంటి సన్నివేశాలను చూపించారు. అతడిని చంపడానికి వేల మంది జనాలు రెడీగా ఉన్నారని పోలీసులు అనుకుంటారు.
Also Read : రజనీకాంత్, 'దిల్' రాజు సినిమాకు దర్శకుడు అతడేనా?
కానీ ఆ వ్యక్తిని ఊరేగించడానికి వేల మంది జనాలు జైలు దగ్గరకు తరలివస్తారు. మెల్లగా నిప్పుల మధ్య హీరోను రివీల్ చేస్తూ.. 'ఫీల్డ్ లోకి దిగాక యుద్ధంచేయాల్సిందే.. చస్తే వీరమరణం.. గెలిస్తే సింహాసనం.. యుద్ధం మొదలెడదామా అన్నయ్యా' అంటూ హీరోతో డైలాగ్ చెప్పించారు. అదే సమయంలో 'కేడి' అనే టైటిల్ ను రివీల్ చేశారు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది.
Also Read : 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?
ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే సినిమాలో క్యాస్టింగ్ కూడా ఉంది. అయితే నటీనటులను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అర్జున్ జన్య ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విలియం డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.