Sumanth Prabhas New Movie: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తీయడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నారు. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందు మరొక చిన్న సినిమా చేయనున్నారు సందీప్ రెడ్డి వంగా. అందులో హీరో హీరోయిన్లు ఎవరంటే?
సుమంత్ ప్రభాస్ జంటగా అనంతక సనీల్ కుమార్!Sumanth Prabhas to pair up with Ananthika Sanilkumar: ప్రభాస్ అభిమాని, 'మేం ఫేమస్' సినిమా ద్వారా పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్ గుర్తున్నాడా? అతనితో సందీప్ రెడ్డి వంగా సినిమా చేస్తున్నారు. అయితే ఆ చిత్రానికి ఆయన డైరెక్షన్ చేయడం లేదు... ప్రొడ్యూస్ చేస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ హౌస్ భద్రకాళి పిక్చర్స్‌లో సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. దీనికి సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ సరసన 'మ్యాడ్', '8 వసంతాలు' ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా ఎంపిక అయ్యారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణు పరిచయం!సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే సందీప్ రెడ్డి వంగాకు అభిమానం. ఆ విషయాన్ని పలు సందర్భాలలో చెప్పారు. ఇటీవల జగపతిబాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోకి కూడా ఇద్దరూ హాజరు అయ్యారు. ఆ సమయంలో వర్మపై సందీప్ అభిమానం, ఇద్దరి మధ్య స్నేహం బయట పడింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణును దర్శకుడగా పరిచయం చేస్తూ సుమంత్ ప్రభాస్, అనంతిక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా.
Also Read: నాగార్జున వందో సినిమా దర్శకుడితో... OG Heroine ప్రియాంక సినిమా... థియేటర్లకు కాదు, ఎందుకో తెలుసా?
తెలంగాణ నేపథ్యంలోని ఒక పల్లెటూరి ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుందట. ఇది ప్రేమ కథ అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగా మార్క్ టచ్ సైతం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: ఎక్స్‌క్లూజివ్... ఇంజ్యూరీ తర్వాత రోజు షూటింగ్ - దటీజ్ ఎన్టీఆర్, డెడికేషన్‌కు మారు పేరు