Samantha Shares Post Supporting Vinesh Phogat: ప్రస్తుతం ప్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌పైనే ఇండియన్స్ అందరి దృష్టి ఉంది. ఒలింపిక్స్ ప్రారంభమయ్యి ఇన్నిరోజులు అవుతున్నా ఇండియాకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. చివరికి వినేశ్ ఫొగాట్ వల్ల రెజ్లింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ ఆశలు కనిపించాయి. వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్‌ను ఎదిరించి బంగారు పతకం వైపు పరుగులు తీసింది వినేశ్. కానీ అనుకోని విధంగా తను ఒలింపిక్స్‌కు అనర్హురాలు అంటూ ప్రకటించారు. దీంతో ఇండియన్స్ అంతా వినేశ్ ఫొగాట్‌కు ఇలా జరగడం కరెక్ట్ కాదంటూ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అందులో సమంత కూడా ఒకరు.
వారికే అన్నీ కష్టాలు..
వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడం ఇష్టం లేనివారంతా తనకు మద్దతు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. సీనియర్ హీరోయిన్ సమంత కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అయ్యింది. ‘‘కొన్నిసార్లు అన్ని ఎదుర్కోగల బలమైన మనుషులకే కష్టమైన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు ఒంటరిగా లేవనే విషయం మర్చిపోకు. పైన ఉన్నవాడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి కష్టాల మధ్య నిలదొక్కుకునే నీ సామర్థ్యం చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. కష్టాల్లో, సుఖాల్లో నీతో మేము ఉన్నాం’’ అంటూ వినేశ్ ఫొగాట్ ధైర్యం చెప్పింది సమంత. తన ఫ్యాన్స్ కూడా సమంత చేసిన పోస్ట్‌కు సపోర్ట్‌గా కామెంట్స్ పెడుతున్నారు. వినేశ్ ఫొగాట్ బరువు ఉండాల్సిన దానికంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందంటూ తనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన ఇచ్చింది ఒలింపిక్స్ యాజమాన్యం
వినేశ్ ఫొగాట్ రికార్డ్..
ఒలింపిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారి భారత ప్రజలు నిరాశకు గురయ్యారు. బంగారు పతకం తీసుకొస్తుందని వినేశ్ ఫొగాట్ పెట్టుకున్న ఆశలన్నీ కరుమరుగయ్యాయి. భారత ఒలింపిక్ సంఘం సైతం ఈ విషయంపై స్పందించింది. కానీ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై పలు అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా రాజకీయమే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఒలింపిక్స్‌లోని రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకొని బంగారు పతకం కోసం పోటీకి దిగిన మహిళగా వినేశ్ ఫొగాట్ రికార్డ్ సాధించింది. అలాంటి మహిళ గోల్డ్ మెడల్ తీసుకొని ఇండియాకు తిరిగొచ్చుంటే బాగుండేదని చాలామంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా వినేశ్ ఫొగాట్‌కు మద్దతు పలుకుతూ పోస్టులు పెడుతున్నారు.
Also Read: వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై రాజకీయ రగడ, కచ్చితంగా కుట్రేనన్న వాదనలు