Samantha Marriage Rumours Viral: విడాకుల అనంతరం సమంతకు సంబంధించిన ఏ వార్తయిన అది చర్చనీయాంశం అవుతుంది. నాగచైతన్య-సమంత విడాకులను ఇప్పటికీ వారి ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ జంట ఒక్కటైతే బాగుండని కోరుకొని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఏంటన్నది ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ డైవోర్స్‌ వల్ల మాత్రం సామ్‌ చాలా కుమిలిపోతుందన్నది నిజం. ఇదిలా ఉంటే విడాకులు ప్రకటన తర్వాత నుంచి సామ్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఆఫర్‌కి ఒకే చెబుతూ రెండేళ్ల పాటు ఖాళీ టైం లేకుండా తనని తాను బిజీ చేసుకుంది.


ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూనే పోతుంది.. ఈ క్రమంలో ఆమె కెరీర్‌కి మయోసైటిస్‌ బ్రేక్‌ వేసింది. అయినా పట్టుదలతో తను సైన్‌ చేసిన ప్రాజెక్ట్స్‌ కంప్లీట్‌ చేసి ప్రస్తుతం ఫుల్‌ రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లింది. 'సిటాడెల్‌ ఇండియా' సిరీస్‌ షూటింగ్‌ పూర్తి కాగానే నటనకు బ్రేక్‌ తీసుకుంది.  ఏడాది పాటు ఏలాంటి పనులు పెట్టుకోనని చెప్పేసింది. దీంతో ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే సమంత గురించిన ఓ షాకింగ్‌ వార్త ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. మొన్నటి వరకు విడాకులతో  వార్తల్లో నిలిచిన ఆమె ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


బంధువుల అబ్బాయితో పెళ్లట


అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే సామ్‌ టీం తేల్చేసినా.. రూమర్స్‌ మాత్రం చెక్ పడటం లేదు. మొన్నటి వరకు రెండో పెళ్లికి సిద్ధమైందన్నారు.. ఇప్పుడు ఏకంగా వరుడి గురించే కథనాలు అల్లేస్తున్నారు. తన దగ్గరి బంధువుతోనే సమంత మళ్లీ పెళ్లి చేసుకుంటుందంటూ ఈసారి మరింత స్ట్రాంగ్ గా ప్రచారం మొదలు పెట్టారు. ఇంట్లో వాళ్లు సమంతను మళ్లీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. ముఖ్యంగా  తన పేరెంట్స్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నారట. తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే సామ్‌ రెండో పెళ్లికి ఒకే చెప్పిదంటూ లేటెస్ట్‌గా గుసగులు వినిపిస్తున్నాయి. దీంతో వారి దగ్గరి బంధువుల అబ్బాయితోనే సమంత పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఈ మేరకు ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.


అయితే ఈ పెళ్లికి సామ్‌ చాలా కండిషన్స్‌ పెట్టిందని సమాచారం.  ఈ మేరకే తన బంధువుల అబ్బాయితో సమంత రెండో పెళ్లంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తన టీం మాత్రం సామ్‌ రెండో పెళ్లి వార్తలను ఖండిస్తూనే వస్తుంది. మరి సమంత నేరుగా స్పందించి తన రెండో పెళ్లి రూమర్స్‌కి చెక్‌ పెడుతుందా? లేదా ఇదే నిజమని తేలుస్తుందా? చూడాలి! కానీ ఆమె ఫ్యాన్స్‌ మాత్రం ఈ పెళ్లి వార్తలను కొట్టిపారేస్తున్నారు.. సమంత ఇప్పటికీ చై జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుందని, అలాంటి ఆమె రెండో పెళ్లి ఎలా చేసుకుంటుందని వాదిస్తున్నారు. ఆమెకు మ్యారేజ్‌ లైఫ్‌పైనే హోప్స్‌ పోయాయని, ఈ విషయాన్ని సామ్‌ కూడా చాలా సార్లు స్పష్టం చేసిందంటున్నారు. మరి ఈ వార్తలపై సమంత ఎలా రియాక్ట్‌ అవుతుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది.