సమంత (Samantha) టైటిల్ పాత్రలో నటించిన 'యశోద' (Yashoda Movie) సరోగసీ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో సరోగసీ మాత్రమే మెయిన్ థీమ్ కాదు. రాజకీయాలు, మర్డర్ మిస్టరీ, విదేశాల నుంచి వచ్చిన సంపన్న మహిళలు వంటి కోణాలు ఉన్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. అయితే... సరోగసీ అనేది కూడా హైలైట్ అయ్యింది. దీనికి నయనతార (Nayanthara) ఓ కారణం అని చెప్పుకోవాలి.


నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా సంతానం (కవలలు) పొందారు. పెళ్ళైన నాలుగు నెలలకు సరోగసీ ద్వారా పిల్లల్ని ఎలా కంటారు? ఇది చట్టాలను ఉల్లంఘించడమే అని చర్చ లేవనెత్తారు కొందరు. తాము ఆరేళ్ళ క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని వాళ్ళు క్లారిటీ ఇచ్చారనుకోండి. అది వేరే విషయం! మొత్తం మీద నయనతార సరోగసీ అందరి నోళ్ళల్లో నానింది. ఆ చర్చ జరుగుతుండగా.. 'యశోద' ట్రైలర్ వచ్చింది. 


'యశోద' సినిమాలో సరోగసీ చట్టాల గురించి చర్చ ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఉంటే... నయనతార ఇష్యూకు ఏమైనా సంబంధం ఉందా? అని కొందరిలో సందేహం మొదలైంది. ఆ సందేహాలకు వరలక్ష్మీ శరత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. 


అది నయనతార ఇష్టం : వరలక్ష్మి
Varalaxmi Sarathkumar On Nayanthara Surrogacy and Yashoda Movie : ''నయనతార ఇష్యూకు, 'యశోద'కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఇష్యూ కంటే ముందు 'యశోద' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇటీవల సరోగసీ ద్వారా పిల్లల్ని పొందిన కథానాయిక ఆమె ఒక్కరే. అందుకని, చెబుతున్నాను. తనకు ఏం కావాలో అది పొందే హక్కు ఆమెకు ఉంది. జడ్జ్ చేయడానికి మనం ఎవరం? అది వ్యక్తిగత నిర్ణయం. సరోగసీ విషయంలో తప్పు ఒప్పు అనేది ఏదీ లేదు. మనది ప్రజాస్వామ్య దేశం'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. 'యశోద'లో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ యజమాని పాత్రలో, సంపన్న మహిళగా ఆమె కనిపించనున్నారు. సినిమాలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉందని ఆవిడ చెప్పారు. 


Also Read : సమంతకు ప్రాణాంతక వ్యాధి - ఏమైందో చెప్పిన బ్యూటీ!






Yashoda Release Date : 'యశోద' సినిమాను నవంబర్ 11న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ప్రధాన తారాగ‌ణం. 


ఈ చిత్రానికి  మాటలు : పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు : రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం : ఎం. సుకుమార్, కళ : అశోక్, పోరాటాలు : వెంకట్, యానిక్ బెన్, కూర్పు : మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.