కొన్నేళ్లుగా సౌత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంతా రూత్ ప్రభు.. ఇటీవల 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. అయితే ఆమె పూర్తిగా కోలుకున్న వెంటనే ఈసారి బాలీవుడ్ పై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సామ్ త్వరలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.
రాజ్ & డీకే తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-2 వెబ్ సిరీస్ తో హిందీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది సమంత. 'పుష్ప: ది రైజ్' చిత్రంలో 'ఊ అంటావా మావా' అంటూ ఐటమ్ సాంగ్ తో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. సామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం చేసిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో నేరుగా ఓ హిందీ సినిమా చేయనుందని, అది కూడా సల్మాన్ కు జోడీగా నటించనుందని బీ టౌన్ లో టాక్ నడుస్తోంది.
Also Read: Jawan 2: బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. కంఫర్మ్ చేసిన డైరెక్టర్!
ప్రస్తుతం 'టైగర్ 3' చిత్రాన్ని దీపావళికి రెడీ చేస్తున్న సల్మాన్ ఖాన్.. విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ తో 'పంజా', అజిత్ కుమార్ తో 'బిల్లా' సినిమాలు తెరకెక్కించిన విష్ణు.. చివరగా 'షేర్షా' మూవీతో బాలీవుడ్ లో సత్తా చాటాడు. ఇప్పుడు సల్లూ భాయ్ తో చేతులు కలపబోతున్నాడు. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
త్వరలో ప్రకటించబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఫిమేల్ లీడ్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు మేకర్స్. పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సౌత్ హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా సమంత ను ఒక ఆప్షన్ గా పరిగణిస్తున్నారట. ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఇదే ఆమెకు బాలీవుడ్ డెబ్యూ అవుతుంది.
నిజానికి సామ్ హిందీ సినిమా గురించి గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏదీ నిజం కాలేదు. మళ్లీ ఇప్పుడు ఆమె డెబ్యూపై టాక్ నడుస్తోంది. కాకపోతే సమంతతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ నయనతార ను కూడా సల్మాన్ మూవీ కోసం పరిశీలిస్తున్నారని అంటున్నారు.
రీసెంట్ గా 'జవాన్' తో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నయనతార.. ఎంట్రీతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. గతంలో విష్ణు వర్ధన్ దర్శకత్వంలో 'బిల్లా' సినిమాలో నటించింది. మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్ కోసం సమంత, నయన్ లలో దర్శకుడు ఎవరిని ఫైనలైజ్ చేస్తారో వేచి చూడాలి.
Also Read: MEGA Teaser: హీరోగా యూట్యూబర్ హర్ష సాయి - ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ టీజర్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial