Samantha On Ananya Panday's CTRL Movie : ఈ మధ్య హీరోలు కానీ.. హీరోయిన్లు కానీ తమ సినిమాలనే కాకుండా.. ఇతర సినిమాలకు కూడా రివ్యూ ఇచ్చి ప్రమోట్ చేస్తూ బాలీవుడ్, టాలీవుడ్ వంటి బేధాలు లేకుండా ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కొందరు స్టార్ సెలబ్రెటీలు కొన్ని సినిమాలు చూసి.. వాటికి సోషల్ మీడియా ద్వారా రివ్యూలు ఇస్తారు. అలాంటివారిలో సమంత కూడా ఒకరు. ఈ భామ తను ఏ సినిమా చూసినా.. దానికి సంబంధించి మినీ రివ్యూ ఇచ్చేస్తుంది. తాజాగా CTRL సినిమాకు రివ్యూ(CTRL Movie Review) ఇచ్చింది సమంత. హీరోయిన్ నటన గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పేసింది.
నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చిన CTRL సినిమా గురించి సమంత రివ్యూ ఇచ్చింది. Highly recommend amd a must watch #CTRL. It is Gripping from start to finish and exceptionally wellmade. @ananyapanday yo beauty, your performance was outstanding. It made me quickly grab my phone and uninstall several apps. congratulations team #CTRL అంటూ రాసుకొచ్చింది. సినిమాలో అనన్య పాండే నటన చాలా బాగుందంటూ.. అందరూ సినిమాను చూడాలని ఇన్స్టాస్టోరిలో పోస్ట్ చేసింది. అలాగే సినిమా చూసి తన మొబైల్లోని కొన్ని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసినట్లు సమంత తెలిపింది. ఇంతకీ సినిమాలో అంత డేంజర్ సబ్జెక్ట్ ఏముంది?
CTRL కథ ఇదే
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అత్యంత సున్నితమైన విషయాన్నే ప్రధాన అంశంగా తీసుకున్నారు మేకర్స్. సోషల్ మీడియా, AI, యాప్స్ ఈ జెనరేషన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో చెప్తూ.. సినిమాను తెరకెక్కించారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్గా ఉండేందుకు తెరవెనుక ఎలాంటి కష్టాలు పడుతున్నారో.. పర్సనల్ లైఫ్‌ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో.. AIని మోతాదుకు మించి వాడితే ఏమవుతుందో వంటి విషయాలను వివరించే ప్రయత్నం చేశారు.
కథ ఎలా సాగుతుందంటే..
నీలా (అనన్య పాండే), జోయ్ (విహాన్). వీరిద్దరూ కాలేజ్ ఫెస్ట్‌లో కలుసుకుంటారు. లవ్‌లో పడతారు. వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంజాయ్ అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారుతారు. బ్రాండ్స్ కూడా వీరిని ప్రమోట్ చేస్తూ ఉంటాయి. లివిన్ రిలేషన్లో ఉంటూ లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. అయితే నీలా ఓరోజు.. జోయ్‌కు బర్త్‌డే సర్ప్రైజ్ ఇచ్చేందుకు వెళ్లేసరికి ఓ షాక్ తగులుతుంది. దీంతో వీరి సోషల్ మీడియా లైఫ్‌కు బ్రేక్ వస్తుంది.
ఈ బ్రేక్నుంచి బయటకు వచ్చేందుకు నీలా AI సపోర్ట్ తీసుకుంటుంది. మళ్లీ బ్రాండ్స్ తనదగ్గరికి వచ్చేందుకు.. సోషల్ మీడియాలో మళ్లీ సెలబ్రెటీ అయ్యేందుకు, కొన్ని విషయాలు మరచిపోయేందుకు AIకి తన యాక్సెస్ ఇస్తుంది. ఆ AI నీలాకి ఎలా హెల్ప్ చేసింది. దానివల్ల జరిగిన అతిపెద్ద నష్టమేమిటి? జోయ్ ఏమయ్యాడు? మొబైల్లో యాప్స్ డౌన్లోడ్ చేసేప్పుడు జాగ్రత్తగా లేకుంటే జరిగే నష్టమేమిటి? వంటి విషయాలను సినిమాలో చూడాల్సిందే.
ఫ్యామిలీతో చూడొచ్చా?
నీలా పాత్రలో అనన్య బాగా ఆకట్టుకుంది. గతంలో కంటే మెరుగైన, మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. జోయ్గా విహాన్ కూడా పరిధిమేర బాగా నటించారు. సినిమా అంతా సోషల్ మీడియా, AI చుట్టే ఎక్కువ తిరుగుతుంది. పర్సనల్ డేటా ఎలా మిస్యూజ్ అవుతుందనే విషయాన్ని సినిమాలో బాగా చూపించారు. టీనేజర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఒకటనే చెప్పవచ్చు. మొత్తంగా సినిమా సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటూనే రియాలిటీని కళ్లముందు చూపిస్తుంది. వీకేండ్ సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఈ సినిమాను చూడొచ్చు.
Also Read : 'శ్వాగ్' రివ్యూ: 'రాజ రాజ చోర' మేజిక్ రిపీట్ అయ్యిందా... శ్రీ విష్ణుకు హ్యాట్రిక్ వచ్చిందా?