Actress Samantha Latest Workout Video : 'ఖుషి' తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే సమంతకు వర్కౌట్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. షూటింగ్లో ఉన్న ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా సమంత మాత్రం డైలీ వర్కౌట్స్ ఎప్పుడూ మిస్ అవ్వదు. ఎప్పటికప్పుడు తన వర్కౌట్ వీడియోస్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన వర్కౌట్ వీడియోని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది సమంత. అంతేకాదు తాను చివరిసారిగా చేస్తున్న వర్కౌట్ ఇదే అంటూ పోస్ట్ పెట్టింది. అంటే దాని అర్థం సామ్ ఇకనుంచి వర్కౌట్స్ మానేస్తుందని కాదు. రెండు రోజుల్లో 2023 కి గుడ్ బై చెప్పి 2024కి చెప్పబోతున్నాం కదా. సమంత కూడా న్యూ ఇయర్ కోసం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ క్రమంలోనే ఇయర్ ఎండింగ్ ను తన వర్కౌంట్స్ తో ముగించింది. వెయిట్ లిఫ్టింగ్ చేసి మరీ 2023 ఏడాదిని ముగిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఓ వీడియోని షేర్ చేసింది. ‘‘2023లో చివరిసారిగా వర్కౌట్ చేయడం ప్రారంభమైంది. ఈ సంవత్సరాన్ని మేము ఇలా ఎక్సర్సైజ్ తో ముగించనున్నాం’’ అంటూ ఆ వీడియోను తన జిమ్ ట్రైనర్ జునైద్ షేక్ ని ట్యాగ్ చేసి మరి పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో సమంత నేవీ బ్లూ స్పోర్ట్స్ బ్రా, గ్రే హై వెయిటింగ్ టైర్స్ ధరించింది. ఇందులో సమంత ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్ ఎక్సర్సైజ్ చేస్తోంది. ఈ ఎక్సర్సైజ్ వల్ల భుజం, కండరాలు బలంగా పెద్దవిగా అవుతాయి. అలాగే ట్రైసెప్ట్స్ ట్రాపిజిఎస్ కండరాల బలానికి ఈ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఇదే వీడియోలో సమంత పక్కనే తన పెట్ డాగ్ కూడా ఉంది. ప్రస్తుతం సామ్ వర్కౌట్స్ వీడియో నెటిజెన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. చివరగా విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్టుని ప్రకటించలేదు. త్వరలో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ కి ప్రీక్వెల్ గా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. సమంత పాటు బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.
Also Read : 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ - ఆ తాతకు థమన్ అంత డబ్బు ఇచ్చాడా?