Samantha Weight: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన హెల్త్, మూవీస్ గురించి అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. మయోసైటిస్‌తో బాధపడుతోన్న సామ్ గత రెండేళ్లుగా జిమ్‌లోనే ఎక్కువగా గడిపేస్తోంది. అది కూడా అందులో మామూలు ఎక్సర్సైస్ లాంటివి కాకుండా భారీ వర్కవుట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆరోగ్యంపై ఇంతగా శ్రద్ధపెట్టే సామ్.. తాజాగా తన బరువు, మెటాబోలిక్ ఏజ్ ఎంత అనే విషయాలను బయటపెట్టింది.
నేచర్‌లో సమంత..
సమంతకు పొద్దపొద్దునే లేవడం, వర్కవుట్స్ చేయడం అలవాటే. ప్రస్తుతం సామ్ హాలీడేలో ఉందని తన ఇన్‌స్టాగ్రామ్ చూస్తే తెలుస్తోంది. కానీ తను ఎక్కడికి వెళ్లిందని విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. గురువారం ఉదయం.. తన రోజును ఎలా మొదలుపెట్టిందో చెప్తూ సమంత ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో తాను వ్యాయమం చేస్తూ కనిపించింది. దీంతో పాటు తన బరువు 50.1 కిలోలు ఉన్నట్టు తెలిపింది. సమంతకు ప్రస్తుతం 36 ఏళ్లు. అయితే, తన మెటాబోలిక్ ఏజ్ 23 మాత్రమే అని పోస్టులో పేర్కొంది.
రియాక్ట్ అయిన సెలబ్రిటీలు..
36 ఏళ్ల వయసులో 23 మెటాబోలిక్ ఏజ్ ఉండడం మంచిదే అని ఫాలోవర్స్ అంటున్నారు. ‘‘ఎప్పటికీ ఉదయం సూర్యుడి కోసం ఎదురుచూస్తూనే ఉంటాను. ఇలాంటి మార్నింగ్స్ చాలా బెస్ట్’’ అంటూ తను షేర్ చేసిన పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టింది సమంత. సామ్ చేసిన ఈ పోస్టుకు పలువురు సెలబ్రిటీలు కామెంట్స్ కూడా పెట్టారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా వెలిగిపోతున్న మృణాల్ ఠాకూర్.. హార్ట్ ఐస్ ఉన్న ఎమోజీని కామెంట్‌లో పెట్టింది. సమంత క్లోజ్ ఫ్రెండ్, దర్శకురాలు నందినీ రెడ్డి కూడా దీనిపై ఫన్నీగా రియాక్ట్ అయ్యింది. ‘‘ఈ వర్కవుట్ ఇప్పుడే చేశా.. రెండుసార్లు’’ అని కామెంట్ చేసింది.
పోడ్కాస్ట్ ప్రారంభం..
ఎన్నో సినిమాలతో సీనియర్ నటి కేటగిరిలో చేరిపోయిన సమంత.. ప్రస్తుతం ఎక్కువగా ఖాళీగా ఉంటూ తన ఆరోగ్యంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. మయాసైటిస్‌కు చికిత్స తీసుకోవడం కోసం కొన్నాళ్లు సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించింది. కానీ తాజాగా తను వర్క్‌ను మళ్లీ ప్రారంభించినట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ ఇచ్చింది సామ్. దాంతో పాటు ఒక హెల్త్ పోడ్కాస్ట్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. చెప్పినట్లే తన మొదటి హెల్త్ పోడ్కాస్ట్‌తో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఈ పోడ్కాస్ట్‌ను తను ప్రారంభించింది ఆరోగ్యపరమైన అవగాహన, సలహాలు ఇవ్వడం కోసమే అయినా ఇందులో తన పర్సనల్ లైఫ్ విషయాల గురించి కూడా సామ్ ఏమైనా చెప్తుందేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: ఆ దర్శకుడిని యూజెలెస్ ఫెలో అని తిట్టేసిన పూనమ్ కౌర్ - నేరుగా పేరు పెట్టి మరీ!