Poonam Kaur about Trivikram: సినీ పరిశ్రమలో కొందరి మధ్య జరిగే కొన్ని గొడవలు ఎప్పటికీ తేలవు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని తెలిసినా అవి ఎందుకు మొదలయ్యాయి, ఎలా మొదలయ్యాయి అని చెప్పకుండానే ఒకరిపై ఒకరు ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసుకుంటారు. టాలీవుడ్‌లో పూనమ్ కౌర్, త్రివిక్రమ్ పరిస్థితి కూడా అంతే. ఇప్పటివరకు పూనమ్ కౌర్.. ఎన్నోసార్లు త్రివిక్రమ్‌ను గురూజీ అని ప్రస్తావిస్తూ విమర్శిస్తూ ట్వీట్స్ చేసింది. నేరుగా ఆయన పేరు ఎప్పుడూ ఉపయోగించకపోయినా.. పూనమ్ అనేది త్రివిక్రమ్‌నే అని అందరికీ తెలుసు. ఇక తాజాగా మొదటిసారి నేరుగా త్రివిక్రమ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తనను మొదటిసారిగా తిట్టేసింది ఈ భామ. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


పవన్ కళ్యాణ్ వీడియోకు కామెంట్..


‘‘వాళ్లు ‘సిద్ధం’ అంటే నేను ‘యుద్ధం’ అని అనాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాంటి పంచ్‌ డైలాగులు సినిమాల్లో కూడా సరిగ్గా చెయ్యను. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’లో ‘‘సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా’’ డైలాగ్ చెప్పమంటే.. నా బాధ భరించలేక కామెడీగా చెప్పామన్నారు’’ అంటూ ఓ వెబ్ సైట్ పోస్ట్ చేసిన వీడియోపై పూనమ్ స్పందించింది. ఆ వీడియో కింద ‘యూజ్‌లెస్ ఫెలో’ అని కామెంట్ చేసింది పూనమ్. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈసారి గురూజీ అని కాకుండా త్రివిక్రమ్ అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది. దీంతో మొదటిసారి త్రివిక్రమ్ పేరు పెట్టి మరీ ఆయనను తిట్టిందని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్ వైరల్ అవుతోంది.


చేసింది పూనమే..


ఇప్పటివరకు త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్ తిట్టలేదు. దీంతో అసలు కామెంట్ వచ్చింది పూనమ్ అఫీషియల్ అకౌంట్ నుండేనా అని కూడా కొందరిలో అనుమానం మొదలయ్యింది. కానీ ఓపెన్ చూసి చూడగా.. అది పూనమ్ అకౌంటే అని తేలింది. మరి ఇన్నిరోజులు పేరు చెప్పకుండా గురూజీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో విమర్శలు కురిపించిన పూనమ్.. ఉన్నట్టుండి త్రివిక్రమ్ పేరును ప్రస్తావించడానికి కారణమేంటి అని నెటిజన్లలో సందేహం మొదలయ్యింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య గొడవ ఏంటో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజన్‌లో ఉండగా.. ఇప్పుడు యూజ్‌లెస్ ఫెలో అని డైరెక్ట్‌గా తిట్టడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పూనమ్ స్పందిస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.


సినిమాలకు దూరం..


ఒకప్పుడు నటిగా తెలుగులో పలు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్.. వెండితెరకు దూరమయ్యి చాలాకాలం అయ్యింది. ప్రస్తుతం తను సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. అప్పుడప్పుడు తనకు నచ్చని విషయాలపై ముక్కుసూటిగా స్టేట్‌మెంట్స్ ఇస్తూ కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తుంది పూనమ్. ముఖ్యంగా గురూజీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో త్రివిక్రమ్ప‌పై తను చేసే పరోక్ష వ్యాఖ్యలు నిరంతరం హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాయి. ఇక త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడూ పూనమ్ ట్వీట్స్‌పై స్పందించడానికి ఇష్టపడలేదు. కానీ మొదటిసారి ఆయన పేరుతోనే నేరుగా యూజ్‌లెస్ ఫెలో అని తిట్టడంతో ఈ విషయంపై అయినా మాటల మాంత్రికుడు స్పందిస్తాడా.. లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: విడాకులకు సిద్ధమైన ఉదయ్ కిరణ్ హీరోయిన్‌ దివ్య ఖోస్లా? - క్లారిటీ ఇచ్చిన టీ-సిరీస్‌ నిర్మాత టీం