Samantha Recycles Wedding Gown: ఎవరికైనా పెళ్లి డ్రెస్ అనేది చాలా స్పెషల్‌గా నిలిచిపోతుంది. సినీ సెలబ్రిటీలకు కూడా అంతే. అదే విధంగా తన పెళ్లికి వేసుకున్న గౌన్.. తనకు చాలా స్పెషల్ అని చెప్పకనే చెప్తోంది సమంత. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా తనతో నాలుగేళ్లు కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకుంది ఈ భామ. కానీ ఇప్పటికీ వారి పెళ్లిలో ధరించిన గౌన్ తనకు చాలా స్పెషల్ అనే ఉద్దేశ్యంతో దానిని రీసైకిల్ చేయించింది. దీంతో ఒకప్పుడు తన పెళ్లిలో వేసుకున్న వైట్ గౌన్ కాస్త.. ఇప్పుడు బ్లాక్ గౌన్‌గా మారింది. ఆ గౌన్ రీసైకిల్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది సామ్.


కొత్తగా రీసైకిల్..


2017లో నాగచైతన్య, సమంత గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నాగచైతన్య హిందూ, సమంత క్రిస్టియన్ కావడంతో రెండు మతాలకు సంబంధించిన సాంప్రదాయాలతో వీరిద్దరికీ రెండుసార్లు వివాహం జరిగింది. వీరి క్రిస్టియన్ వెడ్డింగ్‌లో సమంత ఒక వైట్ గౌన్‌ను ధరించింది. క్రెషా బజాజ్.. ఆ పెళ్లి గౌన్‌ను డిజైన్ చేశారు. ఇప్పుడు అదే గౌన్‌ను ఒక అందమైన బ్లాక్ బాడీకాన్ డ్రెస్‌గా రీసైకిల్ చేశారు క్రెషా బజాజ్. ఒక అవార్డ్ ఫంక్షన్ కోసం ఈ గౌన్‌ను రీసైకిల్ చేస్తున్నట్టుగా వారు ప్రకటించారు. అంతే కాకుండా ఈ రీసైక్లింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఆ గౌన్ తనకు ఎంత స్పెషలో ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది సామ్.


విలువ తెలియాలి..


‘‘నాకు మంచి ఫ్రెండ్ అయిన క్రెషా బజాజ్.. దీనిని డిజైన్ చేశారు. దీనిని ఇలా ధరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకేసారి చాలా ఎమోషన్స్ ఫీలవుతున్నట్టు అనిపిస్తోంది. ఈ డ్రెస్ నాకు ఎప్పుడూ స్పెషలే. కానీ ఇప్పుడు ఇది ఇంకా కొత్తగా కనిపిస్తోంది. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వస్తువుల విలువ ఏంటో తెలియకుండా వాటిని ఒక సందర్భానికి మాత్రమే పరిమితం చేస్తాం. దాని వల్ల వాటి విలువ మనం గుర్తించలేం. కానీ సరిగా చూస్తే అవి ఎన్నో విధాలుగా రూపాలు మార్చుకోగలవు’’ అంటూ తన గౌన్‌ను రీసైకిల్ చేయడంపై వ్యాఖ్యలు చేసింది సమంత. ఇక ఈ బ్లాక్ గౌన్‌లో తను ఎలా ఉంటుందో చిన్న గ్లింప్స్ కూడా చూపించింది.






కొత్త కథ..


సమంత, క్రెషా బజాజ్.. గౌన్‌ను రీసైకిల్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు దానికి ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జతచేశారు. ‘‘కొత్త జ్ఞాపకాలు అనేవి ఎప్పుడూ పుట్టుకొస్తూనే ఉంటాయి. కొత్త దారులు అనేవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. కొత్త కథలు వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మా ఫ్రెండ్ సమంతతో కలిసి ఒక కొత్త జ్ఞాపకాన్ని క్రియేట్ చేయడం, కొత్త కథను చెప్పడం చాలా సంతోషంగా ఉంది. బ్యూటీ అనేది ఎప్పటికీ చిరకాలంగా నిలిచిపోతుంది. ప్రతీరోజు అది కొత్త రూపాన్ని దాల్చుతుంది’’ అని క్రెషా బజాజ్ ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొత్తానికి సమంత.. తన పెళ్లి గౌన్‌ను రీసైకిల్ చేయించడం ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.



Also Read: మ‌రోసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన మేఘ ఆకాశ్.. అస‌లు పెళ్లి ఎవ‌రిదంటే?